Youth Beats Friend To Death With Cricket Bat (Photo : Google)
Youth Beats Friend To Death With Cricket Bat : సరదా కోసం ఆడిన ఆట తీవ్ర విషాదం నింపింది. క్రికెట్ కారణంగా ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. క్రికెట్ లో తలెత్తిన ఘర్షణ హత్యకి దారితీసింది. ఓ యువకుడు తన స్నేహితుడిని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు. మహారాష్ట్రలోని భండారాలో ఈ ఘోరం జరిగింది. అద్యాల్ గ్రామంలోని గ్రౌండ్ లో రెండు టీమ్స్ క్రికెట్ ఆడాయి. ఈ క్రమంలో గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన కరణ్ బిలవానే(21) తన ప్రత్యర్థి టీమ్ కి చెందిన స్నేహితుడు కావ్లే(24)ని క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపేశాడు.
బిలవానేకి చెందిన జట్టు మూడుసార్లు గెలిచింది. అయితే, నాలుగోసారి మరో మ్యాచ్ ఆడాలని కావ్లే పట్టుబడ్డాడు. దీనికి బిలవానే ఒప్పుకోలేదు. ఇప్పటికే మూడుసార్లు గెలిచాము, ఇక ఆడేది లేదని తేల్చి చెప్పాడు. అయితే, కావ్లే ఒప్పుకోలేదు. కచ్చితంగా నాలుగో మ్యాచ్ ఆడాల్సిందే అని మొండికేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
Also Read : ఆ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చిందా? లిఫ్ట్ చేశారో ఇక అంతే- పోలీసుల వార్నింగ్
బిలవానే సహనం కోల్పోయాడు. కోపంతో ఊగిపోయాడు. క్రికెట్ బ్యాట్ తో కావ్లేపై విచక్షణరహితంగా దాడి చేశాడు. తల, మెడ, ఇతర అవయవాలపై కొట్టాడు. దీంతో కావ్లే అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి స్పృహ కోల్పోయిన కావ్లేని ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో, రక్తం ఎక్కువగా పోవడంతో కావ్లే అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కావ్లేని బ్యాట్ తో కొట్టిన చంపిన బిలవానేని పోలీసులు అరెస్ట్ చేశారు. కావ్లే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు కావ్లే నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తల్లిదండ్రులు కూలీలు. కావ్లే పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు.
Also Read : షాకింగ్ వీడియో.. లైవ్‌లో యాంకర్ దారుణ హత్య, గన్‌తో కాల్చి చంపిన దుండగుడు