ఇండియన్ నేవీలో ఎగ్జిక్యూటివ్/టెక్నికల్ బ్రాంచ్ ల్లో ఖాళీగా ఉన్న 102 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయటానికి ప్రకటన జారీ చేశారు. దరఖాస్తులు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1 లోపు పంపిచాలి. అభ్యర్ధులు జనవరి 2,1995 నుంచి జులై 1, 2000 మధ్య పుట్టినవారై ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్హతలు ఉన్న అభ్యర్ధులు, ఇంజనీరింగ్ చివరిసంవత్సరం చదివే అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు విద్యార్హతలతో పాటు నిర్దిష్ట శారీరక,వైద్యప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్ధులు పూర్తి వివరాలకు www.joinindiannavy.gov.in ను సంప్రదించి మరింత సమాచారం పొందవచ్చు.