AAI Recruitment 2025: ఎఎఐలో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్.. నోటిఫికేషన్ విడుదల.. లక్షపైనే జీతం.. ఒక్క క్లిక్ తో ఇలా అప్లై చేసుకోండి
AAI Recruitment 2025: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

AI has released a notification for 976 Junior Executive posts.
యువతకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థలో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 27 వరకు కొనసాగనుంది. కాబట్టి.. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ aai.aero ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) 11 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీర్-సివిల్) 199 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్) 208 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) 527 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 31 పోస్టులు
విద్యార్హత:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్), కంప్యూటర్ ఇంజనీరింగ్ / ఐటీ లాంటి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అలాగే గేట్ పరీక్ష చెల్లుబాటు అయ్యే స్కోర్ కార్డ్‌ను కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రం నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
వేతన వివరాలు:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు జీతం అందుతుంది. జీతంతో పాటు వైద్య, పెన్షన్, ప్రయాణ భత్యం వంటి ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా లభిస్తాయి.
దరఖాస్తు రుసుము:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి రుసుము ఉండదు.
దరఖాస్తు ఇలా చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ aai.aero లోకి వెళ్ళాలి.
- తర్వాత కెరీర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
- అందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్‌మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌ను నింపి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేస్తారు.
- తరువాత దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో పే చేయాలి.
- ఫారమ్‌ను సబ్మిట్ చేసి ప్రింటవుట్/ సేవ్ చేసుకోవాలి.