Akash Baijus: హైదరాబాద్‌లో మరో క్లాస్‌రూమ్‌ కేంద్రం ప్రారంభించిన ఆకాష్ బైజూస్‌

Akash Baijus: హైదరాబాద్‌లో మరో క్లాస్‌రూమ్‌ కేంద్రం ప్రారంభించిన ఆకాష్ బైజూస్‌

Akash Baijus started classroom center

Updated On : April 4, 2023 / 9:21 PM IST

Akash Baijus: దేశంలో టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్థ ఆకాష్‌ బైజూస్‌ నేడు తమ నూతన క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లోని హబ్సిగూడా వద్ద ప్రారంభించింది. నగరంలో ఎనిమిదివ తరగతి నుంచి నీట్‌, జెఈఈ, ఐఐటీ, ఒలింపియాడ్‌ కోచింగ్‌, ఫౌండేషన్‌ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ఈ కేంద్రం ప్రారంభించారు.

IPL 2023: పాయింట్ల టేబుల్ లో అగ్రస్థానంలో ఏ టీమ్?.. ఆరెంజ్ క్యాప్ పోటీలో ఎవరిది ముందంజ?
భారీ 8888 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడవ అంతస్థు, సాయి సందీప్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ బిల్డింగ్‌, మెట్రో పిల్లర్‌ నెంబర్‌ సీ 973, 7/101, గెలాక్సీ టవర్స్‌ పక్కన, నాగేంద్ర నగర్‌, హబ్సిగూడా వద్ద ఉన్న ఈ నూతన కేంద్రంలో 11 తరగతి గదులు ఉంటాయి. ఇవి 1200 మంది విద్యార్థులకు తగిన సౌకార్యలను అందించగలవు. హైదరాబాద్‌ నగరంలో ఆకాష్‌ బైజూస్‌కు ఇది ఎనిమిదవ కేంద్రం.

Primebook 4G: ఫ్లిప్‌కార్ట్‌ అమ్మకాల్లో ప్రైమ్‌బుక్‌ 4జీ టాప్.. రూ.20వేల లోపు ఇదే హాట్

ఈ క్లాస్‌రూమ్‌ కేంద్రం వైద్య, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధుల అవసరాలతో పాటుగా ఫౌండేషన్‌ స్థాయి కోర్సుల అవసరాలను సైతం తీర్చనుంది. విభిన్నమైన పోటీపరీక్షలు అయినటువంటి ఒలింపియాడ్స్‌ మొదలైన వాటిలో పాల్గొనే వారికి సహాయపడే కోర్సులను అందించడంతో పాటుగా తమ బేసిక్స్‌ను సైతం మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.