AP AgriCET 2025 Notification: ఏపీ అగ్రిసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది.. రిజిస్ట్రేషన్లు ఇవాళ్టి నుంచే.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

AP AgriCET 2025 Notification: ఆంధ్రప్రదేశ్ అగ్రిసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలకు నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలుకానుంది.

AP AgriCET 2025 Notification: ఏపీ అగ్రిసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది.. రిజిస్ట్రేషన్లు ఇవాళ్టి నుంచే.. ముఖ్యమైన తేదీలు, పూర్తి వివరాలు

AP AgriCET 2025 Notification Released

Updated On : July 11, 2025 / 12:03 PM IST

ఆంధ్రప్రదేశ్ అగ్రిసెట్ – 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలకు నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలుకానుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జూలై 26వ తేదీ లోగా అప్లికేషన్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ www.angrau.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ అగ్రిసెట్ 2025 ముఖ్య తేదీలు, వివరాలు:

అర్హతలు: అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానికి ఫార్మింగ్ లో రెండేళ్ల డిప్లోమా పూర్తి చేసి ఉండాలి.

ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ: 11 జూలై 2025 నుంచి మొదలు

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26 జూలై 2025 వరకు చేసుకోవచ్చు

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులలు రూ. 500, ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది.

పోస్ట్ ద్వారా హార్డ్ కాపీ సమర్పించే తేదీ: ఆగస్టు 5 లోగా ది కన్వీనర్, AGRICET-2025, O/o ది ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎంటమాలజీ, అగ్రికల్చర్ కాలేజీ, బాపట్ల -522 101, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ కి హార్డ్ కాపీ పోస్ట్ చేయాలి.

అవసరమయ్యే ధ్రువపత్రములు: ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసిన అప్లికేష‌న్ హ‌ర్డ్ కాపీ, ఎస్ఎస్‌సీ స‌ర్టిఫికేట్, డిప్లొమా మార్కుల జాబితా, కండ‌క్ట్ స‌ర్టిఫికేట్‌, పుట్టిన తేదీ స‌ర్టిఫికేట్‌, కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, లోక్ స‌ర్టిఫికేట్, పీహెచ్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, సీఏపీ, ఒక పాస్‌పోర్టు సైజ్ పోటో, అప్లికేష‌న్ ఫీజు పేమెంట్ రిసిప్ట్‌.

ఫైన్ తో ద‌ర‌ఖాస్తు చేయాలనుకుంటే: జ‌న‌ర‌ల్, బీసీ అభ్య‌ర్థులకు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులకు రూ.1,500. ఇది జూలై 27న మొదలై జులై 29న ముగుస్తుంది.

హాల్ టికెట్లు విడుదల: ఆగస్టు 14

పరీక్ష నిర్వహణ: ఆగస్టు 18.