ఒక్కసారిగా వచ్చి హగ్ చేసుకున్నారు.. నా కళ్లల్లో నీళ్లు తిరిగిపోయాయి: బార్బరిక్ సినిమా దర్శకుడు
"సెకండ్ హాఫ్ ఇంకా బాగుందని నాకు చెప్పారు. ఆ తర్వాత నేను బయటక వచ్చి ఆలోచిస్తూ బాధపడుతూనే ఒక్క 20 మంది వచ్చి ఉంటే టాక్ వెళ్లేదేమో అని బాధపడుతూనే ఉన్నాను" అని చెప్పారు.

Director Mohan Srivatsa Video
Director Mohan Srivatsa Video: త్రిభాణదారి బార్బరిక్ సినిమా దర్శకుడు మోహన్ శ్రీవత్స కారులో వెళ్తూ తన సినిమా గురించి మాట్లాడుతూ ఆవేదనకు గురైన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. ఆయన చెప్పుతోనూ కొట్టుకున్నారు.
దీనిపై 10టీవీతో మోహన్ శ్రీవత్స ఇవాళ మాట్లాడారు. “సినిమా గురించి మౌత్ టాక్ వెళ్లడానికి ఒక మూమెంట్ ఉంటుంది. అట్లీస్ట్ థియేటర్ లో ఒక 5% – 10% ఆక్యుపెన్సీ ఉంటేనే మౌత్ టాక్ వెళ్తుంది. మరీ 1% – 0.5% ఆక్యుపెన్సీ ఉంటే మౌత్ టాక్ అనేది అవ్వదు..
స్ప్రెడ్ అవ్వదు చాలా కష్టం. నా ఆవేదన అదే. మలయాళం కంటెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్లు చాలా బ్రిలియంట్ గా తీస్తారు. అలాంటివి ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు. తుడరం లాంటి సినిమా చూశారు.. పోర్తోరిల్ లాంటి సినిమా చూశారు..
దృశ్యం లాంటి సినిమాని ఇక్కడ చేస్తే చూశారు.. వాళ్లకి అది నచ్చింది. నేను త్రిభాణదారి బార్బరిక్ సినిమా థియేటర్‌లో విడుదలవుతున్న వేళ బుక్ మై షో ఓపెన్ చేసి చూశాను.. ఎనిమిది టికెట్లు బుక్ అయ్యాయి. కనీసం 10 టికెట్లు బుక్ అవ్వకపోతే థియేటర్ డెఫిషిట్ పతుతుంది.. షో వేయరు. ఇమ్మీడియట్ గా ఫోన్ తీసి నేనే రెండు టికెట్లు బుక్ చేసేసాను.
థియేటర్ కి వెళ్లాను. అసలు ఈ ఎనిమిది మంది అయినా సినిమా బాగలేదని, అట్లీస్ట్ 50% మందయినా బాగలేదు అని అంటే నేను డివైడ్ టాక్ కింద తీసుకునేవాడిని. ఇక నాకు నో ప్రాబ్లం.. మంచి కథని మళ్లీ రాసుకుందామని అనుకునేవాడిని. (Director Mohan Srivatsa Video)
కానీ థియేటర్‌లో అయిపోయిన తర్వాత నేను ఆ ఎనిమిది మంది ప్రేక్షకులను అడిగాను.. సినిమా ఆ ఎలా ఉంది అని అడిగాను.. సినిమా బాగుంది బట్ ఎందుకు అది జనాలు రావట్లే తెలియట్లేదు. ఫస్ట్ హాఫ్ గురించి ఒకాయన చెప్పాడు.
బార్బరిక్ టైటిల్ వల్ల ఇబ్బందిలో ప్రేక్షకులు రావట్లేదేమో అని మరొకరు అన్నారు. ఇలా నేను రిపోర్ట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ సినిమాని డైరెక్ట్ నేనే చేశానని చెప్పాను. ఒక్కసారిగా వచ్చి హగ్ చేసుకున్నారు. నా కళ్లల్లో నీళ్లు తిరిగిపోయాయి. ఎక్సలెంట్ తీశారని అన్నారు. ఇంత చిన్న లోపాలు ప్రతి సినిమాకి ఉంటాయని చెప్పారు. చాలా గ్రిప్పింగ్గా సినిమా తీసుకెళ్లారని, ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని అన్నారు.
సెకండ్ హాఫ్ ఇంకా బాగుందని నాకు చెప్పారు. ఆ తర్వాత నేను బయటక వచ్చి ఆలోచిస్తూ బాధపడుతూనే ఒక్క 20 మంది వచ్చి ఉంటే టాక్ వెళ్లేదేమో అని బాధపడుతూనే ఉన్నాను. అసలు పక్క సినిమా ఏంటనేది ఓపెన్ చేశాను.
ఓపెన్ చేసేసరికి అక్కడ ఒక మలయాళం డబ్బింగ్ సినిమా ఆడుతోంది. డబ్బింగ్ సినిమాకు హౌస్ ఆల్మోస్ట్ 90% ఫుల్. కింద లైన్ మాత్రమే ఖాళీ ఉంది. నేను ఏం తప్పు చేశాను.. నేను విజువల్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు.. కంటెంట్ దగ్గర ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. మరి జనాలు ఎందుకు రావట్లేదు?” అని అన్నారు.