Inte Results 2026 : ఏపీ, తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్స్ ఎప్పుడంటే
Inte Results 2026 : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది.
Andhra pradesh and telangana intermediate exams 2026 results will be announced in april
Inte Results 2026 : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 18న పూర్తి కాగా ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలు మార్చి 25న ముగుస్తాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షా ఫలితాలపై కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణలో ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్షలు జరుగుతుండగానే మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచే పేపర్లు దిద్దే పని మొదలైందని.. మార్చి 25 నాటికి మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందంటున్నారు అధికారులు. ఈ క్రమంలో ఏప్రిల్ 5-10 తేదీల మధ్యలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
తెలంగాణలో ఏప్రిల్ 24 నుంచి ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు మొదలవుతాయి. జూన్ 1న కాలేజీలు తిరిగి పునఃప్రారంభమవుతాయి. ఈలోగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా ముగించి మే 31 నాటికి ఫలితాలు ప్రకటించాలని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్ ఫలితాలను ఆలస్యంగా విడుదల చేస్తుండటం వల్ల.. విద్యాబోధనపై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా జూన్ 1 నుంచే ఇంటర్ కాలేజీలు మొదలైనా.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, మూల్యాంకనం వంటి వాటితో సమయం వృథా అవుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇంటర్ బోర్డు అధికారులు ఈసారి కాస్త త్వరగానే ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు.
ఏపీలో..
ఇదిలా ఉంటే ఏపీలో ఇంటర్ పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు. మార్చి 25న పరీక్షలు ముగుస్తాయి. ఈ క్రమంలో ఏప్రిల్ రెండో వారంలోగా ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రకటించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఏపీ ఇంటర్ విద్యార్థుల విషయానికి వస్తే.. ప్రధాన పరీక్షలన్నీ బుధవారం (మార్చి 18)తో పూర్తయ్యాయి. మిగిలిన పరీక్షలు మార్చి 25వ తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 22 నుంచి రాష్ట్రంలో ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం మొదలుకానుంది. ఇక ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 10లోపు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
