AP Constable Results: ఏపీ కానిస్టేబుల్ అభ్యర్తలకు బ్యాడ్ న్యూస్.. ఫలితాల విడుదల వాయిదా
AP Constable Results: షెడ్యూల్ ప్రకారం జులై 29 2025 అంటే ఇవాళ ఫలితాలు విడుదల అవ్వాలి కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా పడింది.

Andhra Pradesh Constable results postponed to tomorrow
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 2022లో కానిస్టేబుల్ ప్రవేశ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అభ్యర్థులు ఫలితాల కోసం కళ్ళు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. కొన్ని లీగల్ సమస్యల కారణంగా ఫలితాల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సెట్ చేసిన షెడ్యూల్ ప్రకారం జులై 29 2025 అంటే ఇవాళ ఫలితాలు విడుదల అవ్వాలి కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా పడింది. రేపు అనగా జులై 30 బుధవారం రోజున ఉదయం 11:00 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిష్టర్ వంగలంపూడి అనిత విడుదల చేయనున్నారు. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.
మీ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in లోకి వెళ్ళాలి
- హోమ్‌పేజీలో ఫలితాలు లింక్‌పై క్లిక్ చేయాలి
- మీ హాల్ టికెట్ నంబర్/రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ/పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి
- ఫలితాలు డిస్ప్లే అవుతాయి
- భవిష్యత్ ఉపయోగం కోసం మీ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి