Andhra University Admission : ఆంధ్ర విశ్వవిద్యాలయం సెల్ఫ్ సపోర్ట్ మోడ్ లో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రాం లో ప్రవేశాలు
సీట్ల వివరాలకు సంబంధించి ఎంసీఏ సీట్లు 10, ఎంబీఏ ప్రోగ్రాంకు సంబంధించి మార్కెటింగ్ మేనేజ్మెంట్ 44 సీట్లు, ఫైనాన్స్ మేనేజ్మెంట్ సీట్లు 44, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ 44 సీట్లు ఉన్నాయి.

Andhra University admissions in MBA, MCA program in self support mode
Andhra University Admission : విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సెల్ఫ్ సపోర్ట్ మోడ్ లో ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రాం లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ లో ఎంబీఏ, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎంసీఏ సీట్లు ఉన్నాయి.
సీట్ల వివరాలకు సంబంధించి ఎంసీఏ సీట్లు 10, ఎంబీఏ ప్రోగ్రాంకు సంబంధించి మార్కెటింగ్ మేనేజ్మెంట్ 44 సీట్లు, ఫైనాన్స్ మేనేజ్మెంట్ సీట్లు 44, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ 44 సీట్లు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు ఏపీ ఐసెట్ – 2022 ర్యాంకు సాధించి ఉండాలి.
దరఖాస్తులను ఆఫ్‌లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్ర యూనివర్సిటీ, విజయనగర ప్యాలెస్, పెదవాల్తేరు, విశాఖపట్నం చిరునామా కు పంపాలి. దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 22, 2022. గా నిర్ణయించారు. కౌన్సిలింగ్ ను అక్టోబర్ 25, 2022 జరుగుతుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్:http://www.audoa.in పరిశీలించగలరు.