ఏపీలోని గ్రామ సచివాలయాల్లో పశుసంవర్థక శాఖ పరిధిలోని ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ (AHA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మొత్తం 6వేల 858 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలు ఉంటాయి. పదోతరగతి విద్యార్హతతో సంబంధిత విభాగంలో ఒకేషనల్ కోర్సులో అర్హత సాధించినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
విద్యార్హత:
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి రెండేళ్ల పాలిటెక్నిక్ పూర్తిచేసి ఉండాలి. రెండేళ్ల ఇంటర్ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసుండాలి.
వయసు:
అభ్యర్ధులు జులై 1, 2020 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్ధులు దరఖాస్తు ఫీజుగా రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్ధులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ముఖ్యతేదిలు:
దరఖాస్తు ప్రారంభం: జనవరి 11, 2020.
దరఖాస్తు చివరితేది: జనవరి 31, 2020.
ఫీజు చెల్లిచడానికి చివరితేది: జనవరి 30, 2020.