ఫిబ్రవరి 20న..ఏపీ ఎంసెట్‌ షెడ్యూలు విడుదల

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 09:19 AM IST
ఫిబ్రవరి 20న..ఏపీ ఎంసెట్‌ షెడ్యూలు విడుదల

Updated On : February 15, 2019 / 9:19 AM IST

ఏపీ లో ఎంసెట్‌ పరీక్షల షెడ్యూలు శనివారం (ఫిబ్రవరి 9) విడుదలైంది. ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబా విజయవాడలో ఎంసెట్-2019 షెడ్యూలును విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్‌ 20 నుంచి ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 24 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఏప్రిల్‌ 20 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి, 23, 24 తేదీల్లో అగ్రికల్చర్‌ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు.  

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను JNTU కాకినాడ చేపట్టనుంది. 

ఫిబ్రవరి 20న ఏపీ ఎంసెట్‌-2019 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 27 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షల హాల్‌టికెట్లను ఏప్రిల్‌ 16 నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 5న ఎంసెట్‌ పరీక్ష ఫలితాలు వెల్లడించనున్నారు. 

Also Read : TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

Also Read : వన్ నేషన్ – వన్ నెంబర్ : 112 గుర్తుపెట్టుకుంటే చాలు

Also Read : ఐసీసీ ట్వీట్: సోలో లైఫే సూపర్.. సింగిల్‌గానే ఉండు

Also Read : వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే