10thలో ఇంటర్నల్ మార్కులు రద్దు: మంత్రి ఆదిమూలపు సురేష్

  • Published By: veegamteam ,Published On : September 28, 2019 / 06:07 AM IST
10thలో ఇంటర్నల్ మార్కులు రద్దు: మంత్రి ఆదిమూలపు సురేష్

Updated On : September 28, 2019 / 6:07 AM IST

పదోతరగతి క్వశ్చన్ పేపర్‌ లో మార్పులు చేయనున్నట్లు గురువారం (సెప్టెంబర్ 26, 2019)న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదోతరగతిలో 20 శాతం ఇంటర్నల్ మార్కులను రద్దు చేయనున్నామని చెప్పారు.

వివరాలు.. మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పదోతరగతిలో పేపర్ 1లో 50 మార్కులు, పేపర్ 2లో 50 మార్కులు ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, ఎస్సే టైప్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో సబ్జెక్ట్‌ లో రెండు పేపర్‌ ల కలిపి పాస్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటాం. అంతేకాదు ఇప్పుడు 18 పేజీల బుక్‌లెట్ ఇవ్వబోతున్నాం అని తెలిపారు.

ఇప్పటి వరకు 45,390 స్కూళ్లకు కమిటీల ఎంపిక పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యాహక్కు చట్టంపై పేరెంట్స్ కమిటీలకు అవగాహన కల్పిస్తామని, పాఠశాలల పర్యవేక్షణ, నియంత్రణలో వారిని భాగస్వాములను చేస్తామని అన్నారు. ఎన్నిక వాయిదా పడిన స్కూళ్లలో సెప్టెంబర్ 28వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అక్టోబర్ లో పేరెంట్స్ కమిటీలకు శిక్షణ ఇస్తామన్నారు. యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం, సైకిళ్ల పంపిణీ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.

కొత్త క్వశ్చన్ పేపర్‌ ఇలా ఉంటుంది…
> సెక్షన్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్స్: 12 ప్రశ్నలు. 1/2 మార్కు చొప్పున మొత్తం 6 మార్కులు.
> సెక్షన్ 2లో సింపుల్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు. 1 మార్కు చొప్పున 8 మార్కులు.
> సెక్షన్ 3లో షార్ట్ ఆన్సర్స్: 8 ప్రశ్నలు. 2 మార్కులు చొప్పున 16 మార్కులు.
> సెక్షన్ 4లో ఏస్సే ఆన్సర్స్: 5 ప్రశ్నలు. 4 మార్కుల చొప్పున మొత్తం 20 మార్కులు.