Apsfc Recruitment : ఏపి స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ‌

అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సీఏ లేదా సీఎమ్‌ఏ లేదా ఎంబీఏ లేదా పీజీడీఎమ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎమ్‌ఎస్‌ ఆఫీస్‌, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌ వంటి కంప్యూటర్‌ నైపుణ్యాలు కలిగి ఉండాలి.

Apsfc Recruitment : ఏపి స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ‌

Apply Online Vacancies

Updated On : June 10, 2023 / 7:31 AM IST

Apsfc Recruitment : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఏపి స్టేట్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (APSFC)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన 20 అసిస్టెంట్‌ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Boost Your Immunity : ప్రతి సీజన్‌లో మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడే 10 సుగంధ ద్రవ్యాలు !

అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సీఏ  లేదా సీఎమ్‌ఏ లేదా ఎంబీఏ లేదా పీజీడీఎమ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎమ్‌ఎస్‌ ఆఫీస్‌, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌ వంటి కంప్యూటర్‌ నైపుణ్యాలు కలిగి ఉండాలి. బ్యాంక్స్‌,ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌,ఫైనాన్షింగ్‌,అకౌంటింగ్‌,టీఈవీ స్టడీ లేదా తత్సమాన సంస్థలో కనీసం ఏడాదిపాటు పని అనుభవం ఉండాలి.

అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) పోస్టులకు సంబంధించి అభ్యర్ధులు మెకానిక్‌,సివిల్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో 60 శాతం మార్కులతో బీటెక్‌ డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. లా డిగ్రీలో 55 శాతం డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునేవారి వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

READ ALSO : High Blood Pressure : మధుమేహం అధిక రక్తపోటుకు కారణమవుతుందా ? నివారణకు సులభమైన చిట్కాలు !

ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో జూన్‌ 30, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్; esfc.ap.gov.in పరిశీలించగలరు.