Site icon 10TV Telugu

AP Stree Nidhi Jobs: ఏపీ స్త్రీ నిధిలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల.. రూ.25 వేల జీతం.. దరఖాస్తు పూర్తి వివరాలు

AP Stree Nidhi Credit Cooperative Federation Jobs Notification

AP Stree Nidhi Credit Cooperative Federation Jobs Notification

నిరుద్యోగులకు ఏపీ స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక ఏడాదిపాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. జులై 7 నుంచి 18 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో https://www.sthreenidhi.ap.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01 జూన్ 2025 నాటికి 42 ఏళ్లు దాటకూడదు.

దరఖాస్తు రుసుము: ఏ కేటగిరి వారైనా రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

వేతన వివరాలు: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,520 వరకు జీతం అందుతుంది.

ఎంపిక విధానం: ముందు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. తర్వాత అభ్యర్థులను 1:4 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: అధికారిక వెబ్ సైట్ https://www.sthreenidhi.ap.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Exit mobile version