NSIC Recruitment 2025: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. జీతం 2లక్షలు.. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు..

అర్హత, ఇంటర్వ్యూ, ఎంపికకు సంబంధించి యాజమాన్యం తీసుకునే నిర్ణయమే ఫైనల్.

NSIC Recruitment 2025: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. జీతం 2లక్షలు.. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు..

Updated On : October 25, 2025 / 7:35 PM IST

NSIC Recruitment 2025: నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSIC) లో ఉద్యోగాలు పడ్డాయి. మేనేజర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది ఎన్ఎస్ఐసి. డిగ్రీ, ఎంబీఏ, సీఏ, సీఎంఎ, బీఈ, బీటెక్ పాస్ అయి ఉండాలి. దాంతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

అర్హతలు, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 16. దరఖాస్తు ఫీజు రూ.1,500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు ఫీజు మినహాయింపు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://nsic.co.in.

మొత్తం పోస్టులు – 70
పోస్ట్ నేమ్ – మేనేజర్, జనరల్ మేనేజర్
జీతం – 40వేల నుంచి 2లక్షల 20వేలు
వయోపరిమితి – 31 నుంచి 41 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ ఇలా..
* ప్రకటనలోని అర్హత ప్రమాణాల ప్రకారం దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. షార్ట్‌ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది.
* ప్రకటించిన పోస్టుల సంఖ్యకు కనీసం 1:5 నిష్పత్తిలో లేదా గరిష్టంగా 1:7 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు.
* వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలవబడే అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేయడానికి (కనీస అర్హత ప్రమాణాలు/ప్రమాణాలను పెంచడంతో సహా) దాని ప్రమాణాలను రూపొందించే హక్కు యాజమాన్యానికి ఉంటుంది.
* అర్హత, ఇంటర్వ్యూ, ఎంపికకు సంబంధించి యాజమాన్యం తీసుకునే నిర్ణయమే ఫైనల్.
* ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అనుమతించబడవు.
* ఎంపికైన అభ్యర్థి భారత దేశంలోని ఏదైనా NSIC కార్యాలయాలు/సాంకేతిక కేంద్రాలలో పని చేయడానికి/పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 5వేల ఉద్యోగాలు.. అర్హతలు, జీతం, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు..