RRB NTPC Notification 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 5వేల ఉద్యోగాలు.. అర్హతలు, జీతం, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు..

చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్/ స్టేషన్ మాస్టర్ పోస్టులకు రూ.35,400(నెలకు)

RRB NTPC Notification 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 5వేల ఉద్యోగాలు.. అర్హతలు, జీతం, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు..

Updated On : October 21, 2025 / 11:00 PM IST

RRB NTPC Notification 2025: ప్రభుత్వం ఉద్యోగం లక్ష్యంగా శ్రమిస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రైల్వేలో ఉద్యోగాలు పడ్డాయి. 5వేలకు పైగా పోస్టులు ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 5వేల 810 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్‌)లకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు అప్లయ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ లో మాత్రమే అప్లయ్ చేసుకోవాలి. అక్టోబర్‌ 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోడానికి నవంబర్‌ 20 చివరి తేదీ.

రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు:

* అహ్మదాబాద్-79
* అజ్మీర్-345
* బెంగళూరు-241
* భువనేశ్వర్-231
* బిలాస్‌పూర్-864
* చండీగఢ్-199
* చెన్నై-187
* గౌహతి-56
* గోరఖ్‌పుర్-111
* జమ్ము శ్రీనగర్-32
* కోల్‌కతా-685
* మాల్దా-522
* ముంబై-596
* ముజఫర్‌పూర్-21
* పట్నా-23
* ప్రయాగ్‌రాజ్-110
* రాంచీ-651
* సికింద్రాబాద్-396
* సిలిగురి-21
* తిరువనంతపురం-58.

గ్రాడ్యుయేట్ పోస్టులు:
కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్- 161
స్టేషన్ మాస్టర్- 615
గూడ్స్ రైల్ మేనేజర్- 3,416
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్- 921
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 638
ట్రాఫిక్‌ అసిస్టెంట్- 59

* గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత.
* జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్/ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు డిగ్రీ పాసై ఉండాలి. అడిషలన్ గా కంప్యూటర్‌లో ఇంగ్లిష్/ హిందీలో టైపింగ్ స్కిల్ మస్ట్.

వయసు :
జనవరి 01 2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఓబీసీలకు మూడేళ్లు.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు.. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు.

శాలరీ..
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్/ స్టేషన్ మాస్టర్ పోస్టులకు రూ.35,400(నెలకు)
ట్రాఫిక్‌ అసిస్టెంట్‌కు రూ.25,500
ఇతర పోస్టులకు రూ.29,200.

ఎంపిక ఇలా:
* కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్-1, టైర్-2)
* టైపింగ్ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్
* డాక్యుమెంట్ వెరిఫికేషన్
* మెడికల్ ఎగ్జామినేషన్

ఫీజు:
జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500.
ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250.