ఏపీ ఇంటర్ పరీక్షల్లో పాస్ మార్కుల్లో కీలక మార్పులు.. పాస్ కావాలంటే ఇకపై ఎన్నెన్ని మార్కులు రావాలో తెలుసా?
ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ ఏడాది చదువుతున్న వారితో పాటు గతంలో ఫెయిల్ అయి ఈ సారి పరీక్షలు రాస్తున్న వారికి పాస్ మార్కుల్లో కొత్త మార్పులు వర్తించవు.

AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల్లో పాస్ మార్కులు మారాయి. ఈ కొత్త విధానంపై ఇంటర్మీడియట్ విద్యా మండలి కాలేజీలకు వివరాలు తెలిపింది.
ఇంటర్‌లో ఇంతకుముందు వరకు మ్యాథ్స్ 1ఏ, 1బీగా ఉంది. ఈ ఏడాది నుంచి మాత్రం ఒక్కటే సబ్జెక్టుగా ఉంటుంది. ఈ పేపర్‌లో మొత్తం 100 మార్కుల పరీక్షగా ఉంటుంది. (AP Inter Exams)
Also Read: పీఎం-కిసాన్ 21వ విడత డబ్బు: దీపావళికి రాలేదు, ఎప్పుడు వస్తుందంటే..? వీళ్లకి మాత్రం పూర్తిగా రాదు..
ఇందులో విద్యార్థులు 35 మార్కులు సాధిస్తే పాస్ అవుతారు. ఇక బైపీసీలో ఉండే బోటనీ, జువాలజీని బయాలజీగా మార్చారు. ఇంటర్‌లో ఈ పేపరు 85 మార్కులకు ఉంటుండగా, ప్రథమ సంవత్సరంలో విద్యార్థులకు 29 మార్కులు రావాలి.
అలాగే, ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులు రావాలి. అలా వస్తేనే ఆ విద్యార్థులు పాస్ అవుతారు. భౌతిక, రసాయన శాస్త్రాల్లోనూ ఇవే మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఈ సబ్జెక్టులకు ఇంతకుముందు వరకు 60 మార్కుల చొప్పున ఎగ్జామ్స్ నిర్వహించేవారు. వాటిలో 21 మార్కులు వస్తే పాస్‌గా ఉండేది. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ ఏడాది చదువుతున్న వారితో పాటు గతంలో ఫెయిల్ అయి ఈ సారి పరీక్షలు రాస్తున్న వారికి పాస్ మార్కుల్లో కొత్త మార్పులు వర్తించవు.