పీఎం-కిసాన్ 21వ విడత డబ్బు: దీపావళికి రాలేదు, ఎప్పుడు వస్తుందంటే..? వీళ్లకి మాత్రం పూర్తిగా రాదు..
ఈ పథకం ద్వారా అర్హత ఉండే రైతులకు వార్షికంగా రూ.6,000 ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి మూడు విడతలుగా (ఒక్కో విడత రూ.2,000) జమ చేస్తారు.

PM Kisan 21st Installment Release Date: ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 21వ విడత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు దీపావళి నిరాశే మిగిల్చింది. రూ.2,000 చెల్లింపులకు సంబంధించిన నిధులు ఈ పండుగకు విడుదల కాలేదు.
అయితే, నివేదికల ప్రకారం.. ఈ చెల్లింపు 2025 నవంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ఈ-కేవైసీ చేయని, భూమి రికార్డులు ధ్రువీకరించని, లేదా బ్యాంక్ వివరాలు అప్‌డేస్ చేసుకోని రైతులు ఈ విడత ఆ డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. వెంటనే మీ స్టేటస్‌ను చెక్ చేసుకోండి.
ఎప్పుడు వస్తుందో తెలియక ఎదురుచూపులు!
దేశవ్యాప్తంగా 10 కోట్లకు మందికి పైగా రైతులు దీపావళికి ముందే 21వ విడత అందుతుందని ఆశించారు. ఈ రూ.2,000 తమ పండుగ సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని భావించారు. కానీ ప్రభుత్వం దీపావళికి చెల్లింపును విడుదల చేయలేదు. ఇప్పుడు తదుపరి విడత నవంబర్ మొదటి వారంలో జమ అయ్యే అవకాశముందని సమాచారం.
బిహార్ ఎన్నికలకు ముందు ప్రకటన?
నివేదికల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలో 21వ విడతను ప్రకటించే అవకాశం ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు కొన్ని రోజుల ముందు ఈ ప్రకటన రావచ్చని అంచనా వేస్తున్నారు. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంది.
అయితే, బిహార్‌లో ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం కొత్త విడత విడుదల చేయగలదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొత్త పథకాలు ప్రకటించలేనప్పటికీ, ఇప్పటికే ఆమోదించిన పథకాల కింద చెల్లింపులు కొనసాగవచ్చు.
Also Read: అమెజాన్‌లో ఐఫోన్ 16పై కేక పెట్టించే ఆఫర్.. పండుగ ముగిసినా భారీ డిస్కౌంట్ల జోరు
కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు చెల్లింపులు
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 21వ విడత నిధులను విడుదల చేసింది. 2025 సెప్టెంబర్ 26న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ రైతులకు ఈ చెల్లింపును అందించారు. ఇటీవల వచ్చిన వరదలు, నేలరాలిన పంటల కారణంగా ఈ రాష్ట్రాలకు ముందస్తు సాయం అందించారు. అలాగే, అక్టోబర్ 7న జమ్మూకశ్మీర్‌లో రైతులు కూడా ఈ విడత ప్రయోజనం పొందారు.
PM-KISAN పథకం గురించి తెలుసుకోండి
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా అర్హత ఉండే రైతులకు వార్షికంగా రూ.6,000 ఆర్థిక సాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి మూడు విడతలుగా (ఒక్కో విడత రూ.2,000) జమ చేస్తారు. చిన్న, సన్నకారు రైతులకు సాగు అవసరాల కోసం ఆర్థికంగా అండగా నిలవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 20వ విడత 2025 ఆగస్టులో విడుదల కాగా, 85 మిలియన్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు.
ఈ రైతులకు లాభం లభించదు, త్వరపడండి!
ఈ పథకం అర్హతలపై 2019లోనే ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 2019 ఫిబ్రవరి 1ని కట్-ఆఫ్ తేదీగా నిర్ణయించింది. ఈ తేదీ తర్వాత భూమిని కొన్న లేదా పొందిన రైతులు తదుపరి 5 సంవత్సరాల పాటు PM-KISAN లాభాలను పొందలేరు. వారసత్వంగా భూమిని పొందిన వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా, ఈ-కేవైసీ పూర్తి చేయని, బ్యాంక్ ఖాతాలు ఆధార్‌కు అనుసంధానించని రైతులు ఈ విడత ప్రయోజనం పొందలేరు.
ఈ-కేవైసీ సమర్పించడానికి ఇలా చేయండి
ఆన్‌లైన్: pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి OTP బేస్డ్ ఈ-కేవైసీ పూర్తి చేయండి.
CSC: సమీప కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ చేయవచ్చు.
మొబైల్ యాప్: మొబైల్ యాప్ ద్వారా ముఖం గుర్తింపు ఆధారంగా కూడా ఈ-కేవైసీ చేయవచ్చు.
మీ విడత స్టేటస్‌ను ఇలా తనిఖీ చేసుకోండి
- అధికారిక వెబ్‌సైట్ PM-KISANకు వెళ్లండి.
- ‘Beneficiary Status’పై క్లిక్ చేయండి.
- ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
- ‘Get Data’పై క్లిక్ చేయండి.
- మీ విడత స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- త్వరగా ఈ ప్రక్రియలను పూర్తి చేసుకుని, మీ PM-KISAN నిధులను పొందండి