అమెజాన్‌లో ఐఫోన్ 16పై కేక పెట్టించే ఆఫర్.. పండుగ ముగిసినా భారీ డిస్కౌంట్ల జోరు
సాధారణంగా ఇలాంటి డీల్స్ ఎక్కువ కాలం ఉండవు, కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.

iPhone 16 Price Drops: పండుగల సందడి ముగిసినా, అమెజాన్ ఆఫర్ల జోరు ఆగలేదు. ముఖ్యంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తున్న వారికి ఇది శుభవార్త. ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 16ను ఊహించని ధరకు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఐఫోన్ 16పై రూ.18,500 తగ్గింపు
ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 16పై రూ.18,500కి పైగా భారీ తగ్గింపు లభిస్తోంది. సాధారణంగా ఇలాంటి డీల్స్ ఎక్కువ కాలం ఉండవు, కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవడానికి ఇదే సరైన సమయం.
అమెజాన్‌లో ఐఫోన్ 16 డీల్ వివరాలు
భారత్‌లో ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900. అయితే, అమెజాన్ నేరుగా రూ. 13,000 తగ్గింపును అందిస్తూ, ధరను రూ. 66,900కి తీసుకువచ్చింది. అంతేకాదు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 5,750 తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్చుకుంటే మరింత ఆదా చేసుకునే అవకాశం కూడా ఉంది.
Also Read: Nothing Phone 3: అమెజాన్‌లో ఈ కిర్రాక్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు.. చివరి అవకాశం..
యాపిల్ ఐఫోన్ 16 ఫీచర్లు
ఐఫోన్ 16.. 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది, ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ అందిస్తుంది. డిస్‌ప్లేపై సిరామిక్ షీల్డ్ గ్లాస్ ఉంటుంది. హెచ్‌డీఆర్, ట్రూ టోన్ సపోర్ట్ కూడా ఉంది.
ఈ ఫోన్‌లో యాపిల్ 3nm A18 బయోనిక్ చిప్‌సెట్ ఉంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. 22 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్‌తో పాటు, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ 16 IP68 సర్టిఫికేషన్‌తో నీరు, ధూళి నుంచి రక్షణను అందిస్తుంది.
కెమెరా విశేషాలు
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే, ఐఫోన్ 16లో 48MP ఫ్యూజన్ సెన్సార్ ఉంది, ఇది 2x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనికి 12MP మాక్రో లెన్స్ అదనం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా ఉంది, ఇది 4K డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.