Nothing Phone 3: అమెజాన్‌లో ఈ కిర్రాక్‌ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు.. చివరి అవకాశం..

Nothing Phone 3: అమెజాన్‌లో ఈ కిర్రాక్‌ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు.. చివరి అవకాశం..

Updated On : October 22, 2025 / 12:08 PM IST

నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3)పై అమెజాన్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ 45% వరకు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ సేల్ త్వరలో ముగియనుంది. ఈ డీల్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం.

నథింగ్ ఫోన్ 3 ప్రత్యేకతలు

బ్యాటరీ: 5500mAh బ్యాటరీ.

కెమెరా: 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 4K రికార్డింగ్ సపోర్ట్.

ప్రాసెసర్: శక్తిమంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెనరేషన్ 4 చిప్‌సెట్.

స్టోరేజ్, ర్యామ్: 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లు.

ప్రత్యేకత: గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ (ఫోన్ బ్యాక్‌ సైడ్‌ ఆకర్షణీయమైన లైట్ నోటిఫికేషన్ సిస్టమ్).

డిస్‌ప్లే: అమోలెడ్‌ డిస్‌ప్లే.

ధర, డిస్కౌంట్ వివరాలు

భారత్‌లో 2025 జులై 1న విడుదలైన నథింగ్‌ ఫోన్‌ 3 (12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్) అసలు ధర రూ.84,999గా ఉంది. ప్రస్తుతం, 45% తగ్గింపుతో కేవలం రూ.46,524కే కొనుగోలు చేయవచ్చు. అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌పై రూ.1,250 డిస్కౌంట్, అమెజాన్ పే బ్యాలెన్స్‌పై రూ.1,365 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పూర్తి మొత్తం చెల్లించలేని వారికి నెలకు రూ.1,186తో నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Nothing Phone 3 Offer

డిస్‌ప్లే, డిజైన్:

ఈ ఫోన్ 6.67 అంగుళాల 1.5K ఫ్లెక్సిబుల్ అమోలెడ్‌ స్క్రీన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7తో పాటు, IP68 రేటింగ్‌తో నీరు, ధూళి నిరోధకత ఉంది.

Also Read: ఆశ్చర్యం.. ఎవరూ ఊహించనంత తగ్గిన బంగారం ధరలు.. వెంటనే వెళ్లికొన్నారనుకో..

పనితీరు

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెనరేషన్ 4 చిప్‌సెట్‌తో పనిచేసే నథింగ్ ఫోన్ 3, 12GB RAM 256GB స్టోరేజ్, 16GB RAM 512GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది Android 15 ఆధారిత Nothing OS 3.5పై నడుస్తుంది. 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లను పొందుతుంది. Essential Space, Essential Search వంటి AI ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.

కెమెరా

బ్యాక్‌సైడ్‌ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP వైడ్ యాంగిల్ మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. HDR మోడ్‌లో 4K వీడియో రికార్డింగ్, AI ఎన్‌హాన్స్‌మెంట్ సపోర్ట్ ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకుంటాయి.

బ్యాటరీ, ఛార్జింగ్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5500mAh బ్యాటరీతో పాటు, 65W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ వస్తుంది. ఈ అద్భుతమైన డీల్‌ను వదులుకోకండి. అమెజాన్ లో నథింగ్ ఫోన్ 3ని సొంతం చేసుకోండి.