AP Police Jobs: ఏపీలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. పోలీస్ శాఖలో 11వేలకు పైగా ఉద్యోగాలు..

ఏపీఎస్పీ లో 2వేల 520 ఖాళీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా అనేక ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది.

AP Police Jobs: ఏపీలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. పోలీస్ శాఖలో 11వేలకు పైగా ఉద్యోగాలు..

Updated On : October 21, 2025 / 4:33 PM IST

AP Police Jobs: ఏపీలో నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం అందులోనూ పోలీస్ శాఖలో జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారి నిరీక్షణకు తెరపడనుంది. పోలీస్ శాఖలో పెద్ద సంఖ్యలో పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏకంగా 11వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ డిపార్ట్‌మెంట్స్ లో 11 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. వీటి వివరాలను ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. ఇందులో సివిల్ ఎస్ఐ 315 పోస్టులు ఉన్నాయి.

సివిల్‌ కానిస్టేబుల్ 3వేల 580 పోస్టులు ఉన్నాయి. రిజర్వ్ ఎస్ఐ పోస్టులు 96 ఉన్నాయి. ఏపీఎస్పీ లో 2వేల 520 ఖాళీలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా అనేక ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. పోలీస్ శాఖలో జాబ్ కొట్టడం లక్ష్యంగా పెట్టుకున్న వారు మరింత గట్టిగా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది.

Also Read: టెన్త్, ఐటీఐ పాస్ అయితే చాలు.. రైల్వేలో పోస్టులు.. పూర్తి వివరాలు..