Teacher Posts Recruitment : ఏపి ప్రభుత్వ పాఠశాలల్లో 214 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ), ఏపీ టెట్‌ వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు. మ్యూజిక్ టీచర్ పోస్టులకు టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

teacher posts

Teacher Posts Recruitment : ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ , మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ (డిఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేపట్టనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ, సంగీత ఉపాధ్యాయుల పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 214 పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలకు సంబంధించి పాఠశాల విద్య (ప్రభుత్వ/ జడ్పీ/ ఎంపీ/ జీపీఏలో సెకండరీ గ్రేడ్ టీచర్ 69 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 123 పోస్టులు,మ్యూజిక్ టీచర్ 7 పోస్టులు ఉన్నాయి. సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, ఉర్దూ, ఒరియా, సంస్కృతం, తెలుగు, హిందీ.

మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ స్కూల్స్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ 5 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 10 పోస్టులు, మ్యూజిక్ టీచర్ 15 పోస్టులు ఉన్నాయి. సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, ఉర్దూ, ఒరియా, సంస్కృతం, తెలుగు, హిందీ.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌ఏ పోస్టులకు ఏపీ టెట్‌ అర్హత తప్పనిసరి. వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ), ఏపీ టెట్‌ వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు. మ్యూజిక్ టీచర్ పోస్టులకు టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్‌జీటీ పోస్టులకు టెట్‌ కమ్ టీఆర్‌టీ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదిగా 18 సెప్టెంబర్ 2022 తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://apdsc.apcfss.in/ పరిశీలించగలరు.