SAIL Recruitment : స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 7000 నుంచి రూ. 7.700 స్టైపెండ్ చెల్లిస్తారు.

SAIL Recruitment : స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

SAIL Recruitment

Updated On : April 18, 2023 / 11:48 AM IST

SAIL Recruitment : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటటిఫికేషన్‌ ద్వారా మొత్తం 239 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇస్కో స్టీల్‌ ప్లాంట్‌ బర్నపూర్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Donkey Farm : గాడిదల ఫాం తో లక్షల్లో అదాయం పొందుతున్న యువరైతు !

భర్తీ చేయనున్న అప్రెంటిస్ ఖాళీలలో ఎలక్ట్రిషియన్ 65, ఫిట్టర్ 57, రిగ్గర్ 18, టర్నర్ 12, మెషినిస్ట్ 15, వెల్డర్ 32, కంప్యూటర్/ఐసీటీఎస్ఎం 6, ఆర్ఈఎఫ్ అండ్ ఏసీ 16, మెకానిక్ మోటార్ వెహికల్ 5, ప్లంబర్ 6, డ్రాఫ్ట్స్ మ్యాన్ (సివిల్) 7 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 7000 నుంచి రూ. 7.700 స్టైపెండ్ చెల్లిస్తారు.

READ ALSO : Azolla Cultivation : పశువుల దాణాగా…అజోల్లా సాగు

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 29, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.sail.co.in/ పరిశీలించగలరు.