మే 5న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 11:01 AM IST
మే 5న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష

Updated On : April 30, 2019 / 11:01 AM IST

మే 5వ తేదీన గ్రూప్ – 2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే, సాధారణ ఎన్నికలు రావడంతో ప్రిపరేషన్‌కు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయని, పరీక్షను నెలపాటు వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు, పలువురు ప్రజాప్రతినిధులు APPSC చైర్మన్‌కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్నికల ప్రధానాధికారికి విన్నవించారు. కానీ APPSC ఛైర్మన్ ఉదయ భాస్కర్ గ్రూప్ – 2 ప్రిలిమ్స్ కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

727 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ముందే చూసుకుని.. చెప్పిన టైమ్ కంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు. పరీక్ష కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం మే 5న గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా జులై 18, 19 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో గ్రూప్-2 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. 

పరీక్ష విధానం.. 
రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం రెండు దశల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ (ప్రిలిమ్స్) పరీక్ష, రెండో దశలో 450 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్షలో ఒకే పేపర్ ఉండగా మెయిన్ పరీక్షల్లో మాత్రం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కులు. స్క్రీనింగ్ పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే మెయిన్ పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు.