International Education : అంతర్జాతీయ విద్యకు డిమాండ్.. 57శాతం మంది విద్యార్థుల్లో 34 శాతం అమ్మాయిలే..!
International Education : జపాన్, నెదర్లాండ్స్ కొత్త ఆప్షన్లుగా కనిపించడంతో విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఎక్కువగా ఆసక్తిగా చూపిస్తున్నారు. ప్రధానంగా కెనడా, యూకే, యూఎస్ అంతర్జాతీయ విద్యార్థులకు టాప్ ఆప్షన్లుగా ఉన్నాయి.

Around 57 Percent of state board students and 34 Percent of females
International Education : అంతర్జాతీయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులలో దాదాపు 57శాతం మంది రాష్ట్ర విద్యాబోర్డుల నుంచే వచ్చారని ఇటీవలి సర్వేలో తేలింది. ఇందులో 34శాతం మంది మహిళలు ముందున్నారు. జపాన్, నెదర్లాండ్స్ కొత్త ఆప్షన్లుగా ఎంచుకుంటున్న విద్యార్థులు విదేశాల్లోని సంప్రదాయ అధ్యయనానికి మించి ఎక్కువగా చూస్తున్నారు. అందులో ప్రధానంగా కెనడా, యూకే, యూఎస్ అంతర్జాతీయ విద్యార్థులకు టాప్ ఆప్షన్లుగా ఉన్నాయి.
విదేశీ విద్యపై విద్యార్థుల్లో ఆసక్తి :
అంతర్జాతీయ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ బోర్డుల విద్యార్థులు విదేశాలలో చదువుకోవడానికి ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. లీప్‌స్కాలర్ నిర్వహించిన ‘అప్లికేషన్ ఆధారిత సర్వే 2024’ ప్రకారం.. స్థానిక రాష్ట్ర బోర్డుల విద్యార్థులు ప్రపంచ విద్యను అభ్యసించడంలో సమానంగా ఉత్సాహంగా ఉండాలని సూచించింది.
సాంప్రదాయ నేపథ్యాలు, జాతులకు మించి విస్తరించి ఉన్న అంతర్జాతీయ అధ్యయనంలో విభిన్నమైన జనాభాను చేర్చాలని సూచిస్తుంది. అంతేకాకుండా, అంతర్జాతీయ విద్యను చదివే వారిలో (34శాతం) మంది మహిళలు ఉండటం విశేషం. భారత మహిళలు మూస పద్ధతులను బద్దలు కొట్టి, ప్రపంచ విద్యారంగంలో ఎలా ముందంజ వేస్తున్నారో కూడా సర్వే హైలైట్ చేసింది.
కొత్త ఆప్షన్లుగా జపాన్, నెదర్లాండ్స్ :
ఇంకా, గమ్యస్థాన ప్రాధాన్యతలు, అధ్యయన రంగాలలో మార్పును కూడా సర్వే వెల్లడించింది. కెనడా, యూకే, యుఎస్ వంటి టాప్ యూనివర్శిటీలు అత్యంత ప్రజాదరణ పొందిన ఆప్షన్లుగా ఉన్నప్పటికీ, భారతీయ విద్యార్థులు ఈ దేశాలను మించి చూస్తున్నారు. అందులో జపాన్, నెదర్లాండ్స్ కొత్త ఆప్షన్లుగా ఎంచుకుంటున్నారు.
ఎస్‌టీఈఎమ్ కోర్సులు పాపులారిటీ పొందినప్పటికీ, అవి అంతర్జాతీయ విద్యార్థులకు మాత్రమే డ్రాగా ఉండవని సర్వే సూచిస్తుంది. దానికి బదులుగా, విద్యార్థులు సైకాలజీ, లా, స్పోర్ట్స్ సైన్సెస్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్ అండ్ ప్లానింగ్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్‌తో సహా అనేక రకాల సబ్జెక్టులను అన్వేషిస్తున్నారు.
మహిళలే ముందంజలో.. :
రాష్ట్ర బోర్డు విద్యార్థులలో అంతర్జాతీయ విద్యపై ఆసక్తి పెరగడానికి ఆయా దేశాల్లోని డిజిటల్ పరంగా అద్భుతమైన అవకాశాలే కారణంగా చెప్పవచ్చు. అదనంగా, ఆన్‌లైన్ కోర్సులు, ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తృతంగా పెరగడం కూడా విద్యార్థుల్లో అంతర్జాతీయ విద్యను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. “భారతీయ విద్యార్థులు తమకు ఏది బెస్ట్ అనేది ముందుగానే ఆలోచన చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఇప్పుడు విదేశాల్లో చదువుకోవడానికి ఎక్కువగా వెళ్తున్నారు.
భారతీయ విద్యార్థుల్లో ముఖ్యంగా రాష్ట్ర బోర్డుల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. అందులో మహిళా విద్యార్థులు ముందుంటున్నారు. ఈ మార్పు విదేశాల్లో చదువుకోవడానికి పెరుగుతున్న సాంప్రదాయేతర అభ్యాస మార్గాలను అన్వేషించడానికి ఓపెన్‌గా ఉన్న భారతీయ విద్యార్థుల ఆలోచనా విధానాన్ని కూడా ప్రతిబింబిస్తుంది” అని లీప్ సహ వ్యవస్థాపకుడు అర్నవ్ కుమార్ అన్నారు.
సర్వేలోని ఇతర కీలక ఫలితాలు :
జపాన్, నెదర్లాండ్స్ కొత్త ఆప్షన్లుగా కనిపించడంతో విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఎక్కువగా ఆసక్తిగా చూపిస్తున్నారు. అందులో ప్రధానంగా కెనడా, యూకే, యూఎస్ అంతర్జాతీయ విద్యార్థులకు టాప్ ఆప్షన్లుగా ఉన్నాయి. STEM కోర్సులు అంతర్జాతీయ విద్యార్థులలో బాగా పాపులర్ పొందినప్పటికీ, విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులలో సైకాలజీ, లా కోర్సు, స్పోర్ట్స్ సైన్సెస్, ఆర్కిటెక్చర్, బిల్డింగ్, ప్లానింగ్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ వంటి టాప్ ట్రెండింగ్ సబ్జెక్టులు ఉన్నాయని సర్వే వెల్లడించింది.