Rbi Jobs
Jobs : భారతీయ రిజర్వు బ్యాంకులో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 950 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంతోపాటు ఇతర ఖర్చులు కలిపి 45వేల రూపాయల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. సాధారణ అభ్యర్ధులకు 450రూపాయలు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీసుమన్ కు 50 రూపాయల ఫీజు చెల్లించాలి.
అన్ లైన్ లో దరఖాస్తులు పంపేందుకు మార్చి 8, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. ప్రిలిమినరీ పరీక్షలు మార్చి 26,27 తేదీల్లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష మేనెలలో ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://opportunities.rbi.org.in సంప్రదించగలరు.