BOB Recruitment 2025: బ్యాంకు అఫ్ బరోడాలో జాబ్స్.. 41 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు, ఎంపిక పూర్తి వివరాలు
BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ అవకాశాన్నీ అందించనుంది. సంస్థలో మేనేజర్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Bank of Baroda has released a notification for the recruitment of 41 posts.
బ్యాంకింగ్ రంగంలో లైఫ్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ అవకాశాన్నీ అందించనుంది. సంస్థలో మేనేజర్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 41 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 23వ తేదీన మొదలై ఆగస్టు 12 వరకు కొనసాగనుంది. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి.
పోస్టులు, ఖాళీల వివరాలు:
- మేనేజర్ (డిజిటల్ ప్రొడక్ట్) పోస్టులు 7
- సీనియర్ మేనేజర్ (డిజిటల్ ప్రొడక్ట్) పోస్టులు 6
- ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు 14
- మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) పోస్టులు 4
- సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) పోస్టులు 4
- చీఫ్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) పోస్టులు 2
- మేనేజర్ (స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ బ్యాకప్) పోస్టులు 2
- సీనియర్ మేనేజర్ (స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ బ్యాకప్) పోస్టులు 2
దరఖాస్తు రుసుము:
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం/ డీఈఎస్ఎం, మహిళా అభ్యర్థులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్/తదుపరి ఎంపిక ప్రక్రియకు అనువైన ఇతర పరీక్ష ఉండే అవకాశం ఉంది. గ్రూప్ డిస్కషన్/లేదా ఇంటర్వ్యూ. రాత పరీక్ష ఉంటుంది. వీటిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని తుది ఎంపిక చేస్తారు.