BOB recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ, సీఏ, సీఎఫ్ఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 24 నుండి 25 మధ్య ఉండాలి.

BOB recruitment : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగ ఖాళీల భర్తీ

Bank of Baroda Job Vacancy Recruitment

Updated On : September 21, 2022 / 4:55 PM IST

BOB recruitment : భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 72 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, డిజిటల్ లెండింగ్ రిస్క్ స్పెషలిస్ట్, స్పెషల్ అనలిస్ట్, బిజినెస్ మేనేజర్, జోనల్ మేనేజర్ తదితరాలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ, సీఏ, సీఎఫ్ఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 24 నుండి 25 మధ్య ఉండాలి. ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ లలో మెరిట్ అధారంగా తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 11, 2022 తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.bankofbaroda.in. పరిశీలించగలరు.