Maharashtra Bank Recruitment
Maharashtra Bank Recruitment : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణేలో పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. వీటిలో క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-II): 50 పోస్టులు ,క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-III): 50 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అబ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ(ఫుల్‌టైం),బ్యాంకింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ & ఫైనాన్స్, మార్కెటింగ్, ఫారెక్స్, క్రెడిట్, పీజీడీబీఏ, పీజీడీబీఎం, సీఏ,సీఎఫ్‌ఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-II) పోస్టులకు 25-32 సంవత్సరాలు, క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-III) పోస్టులకు 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల సడలింపు వర్తిస్తుంది.
READ ALSO : Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా.?
దరఖాస్తు ఫీజుగా రూ.1180. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.118 నిర్ణయించారు. ఎంపిక విధానం విషయానికి వస్తే ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు వేతనంగా క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-II) పోస్టులకు రూ.48,170-రూ.69,810; క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-III) పోస్టులకు రూ.63,840-రూ.78,230 చెల్లిస్తారు.
పరీక్ష కేంద్రాలను పాట్నా, ఛండీఘడ్, రాయ్‌పూర్, ఢిల్లీ ఎన్‌సీఆర్, పనాజీ, అహ్మదాబాద్, రాంచీ, భోపాల్, ఔరంగబాద్, ముంబయి, నాగ్‌పూర్, పుణె, జైపూర్, లక్నో, కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, చెన్నై, హైదారాబాద్, బెంగళూరు, తిరువనంతపురం లలో ఏర్పాటు చేశారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేదిగా 06.11.2023. నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్; https://bankofmaharashtra.in/ పరిశీలించగలరు.