BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ఘజియాబాద్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

BEL Ghaziabad Recruitment

BEL Recruitment : కేంద్రప్రభుత్వ సంస్ధ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)ఘజియాబాద్‌లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో డిప్యూటీ ఇంజినీర్‌ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Kodali Nani: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. నేను సంస్కారహీనుడిని కాదంటూ ’పకోడీగాళ్లు’ కామెంట్‌పై క్లారిటీ

డిప్యూటీ ఇంజనీర్‌ మెకానికల్‌ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్ధులు తప్పనిసరిగా బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ లేదా ఏమ్‌ఐఈ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. డిప్యూటీ ఇంజనీర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్ధులు తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి. వయసు తప్పనిసరిగా 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

READ ALSO : Mangalagiri Constituency: లోకేశ్ జోరుకు బ్రేక్‌లు వేసేదెవరు.. ఆర్కేను బాపట్లకు మారుస్తారా?

ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు సెప్టెంబర్ 9, 2023వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; bel-india.in పరిశీలించగలరు.