Kodali Nani: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. నేను సంస్కారహీనుడిని కాదంటూ ’పకోడీగాళ్లు’ కామెంట్‌పై క్లారిటీ
జగన్ గురించి, తన గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతాను. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదంటూ కొడాలి నాని అన్నారు.

MLA Kodali Nani
Chiranjeevi birthday Celebrations : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, చిరంజీవి అభిమానులకు అందించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. నేను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేనలకు బూతు మాటలుగా వినపడతాయి. నేనేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసు.. మేమంతా క్లారిటీగానే ఉన్నాం అని అన్నారు.
Political Parties Focus on Celebraties : సినీ ప్రముఖులపై రాజకీయ పార్టీల దృష్టి
రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. జగన్ గురించి, తన గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతాను. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదంటూ కొడాలి నాని అన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొర్లారు. చిరంజీవికి, తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన నేతలు కుట్రలు చేశారని కొడాలి పేర్కొన్నారు. ప్రజారాజ్యం తరపున చిరంజీవి ప్రచారం సమయంలో తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి నేను చేతులెత్తి నమస్కారం పెట్టాను. ఆయనను అనేక సందర్భాల్లో నేను కలిశాను. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామని కొడాలి నాని అన్నారు.
తమకు సూచనలు ఇచ్చినట్లే.. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీగాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలని నేను చెప్పాను. కానీ, నా వ్యాఖ్యలను కావాలనే తప్పుడు ప్రచారం చేశారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రానఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా.. నేను ఆయన గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుంది? అని కొడాలి నాని ప్రశ్నించారు. తనవెంట ఉన్న వ్యక్తులు 60శాతం చిరంజీవి అభిమానులేనని కొడాలి నాని అన్నారు.