CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల

  • Publish Date - May 2, 2019 / 08:14 AM IST

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు గురువారం (మే2, 2019) విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 83.4 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన హన్సికా శుక్లా, అదే రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌కు చెందిన కరీష్మా అరోరా 499/500 మార్కులతో ఈ ఫలితాల్లో తొలిస్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి వరకు పదో తరగతి, 12వ తరగతికి సీబీఎస్ఈ బోర్డు వార్షిక పరీక్షలను నిర్వహంచింది. మొత్తం 12,87,359 మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాశారు. 10, 12 తరగతులకు 31లక్షల 14 వేల 8వందల 21 మంది నమోదు చేసుకున్నారు. వీరిలో 28 మంది ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు. 

దేశవ్యాప్తంగా 4 వేల 9 వందల 74, విదేశాల్లో 78 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటగా మే మూడో వారంలో ఫలితాలు విడుదల చేయాలని ప్రకటించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఫలితాలను ముందే విడుదల చేశారు. అయితే విద్యార్థులకు ఎలాంటి సమాచారం లేకుండా సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారి.