విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు

విజయవాడలోని దూరదర్శన్ సప్తగిరి రీజనల్ న్యూస్ విభాగంలోని వివిధ రకాల ఖాళీలను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవి రెగ్యులర్ ఎంప్లాయ్ మెంట్ పోస్టులు కావు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్దులకి నెలకు 7 అసైన్ మెంట్స్ ఉంటాయి. పోస్టులను బట్టి విద్యార్హతలు వేరు వేరుగా నిర్ణయించబడ్డాయి. ఆసక్తి గల అభ్యర్దులు https://doordarshan.gov.in/whats-new వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్దులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికార వెబ్ సైట్ లో చూడవచ్చు.
పోస్టుల ఇవే..
– అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్
– ప్రొడ్యూసర్
– కాపీ ఎడిటర్
– న్యూస్ రిపోర్టర్
– అసిస్టెంట్ వెబ్ సైట్ ఎడిటర్
– వెబ్ సైట్ అసిస్టెంట్
– బ్రాడ్ క్యాస్ట్ అసిస్టెంట్
– పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్
– ప్రొడక్షన్ అసిస్టెంట్
– వీడియో ఎడిటర్, వీడియోగ్రాఫర్, వీడియో అసిస్టెంట్
– కెమెరామ్యాన్, కెమెరా అసిస్టెంట్
– స్టెనోగ్రాఫర్
– సీజీ ఆపరేటర్
విద్యార్హత : అభ్యర్దులు డిగ్రీ, డిప్లామా జర్నలిజం పూర్తి చేసి ఉండాలి. వీడియో ఎడిటర్, వీడియోగ్రాఫర్, వీడియో అసిస్టెంట్, కెమెరామ్యాన్, కెమెరా అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీజీ ఆపరేటర్ పోస్టులకి 10వ తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : అభ్యర్దుల వయసు 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు చేయు విధానం :
దూరదర్శన్ అధికారిక వెబ్ సైట్ లో ఉన్న దరఖాస్తు ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి. నిర్ణీత గడువులోగా ఫామ్ ని పూర్తి చేసి, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఎక్స్ పీరియన్స్, విద్యార్హతలకు సంబంధించిన జిరాక్స్ కాపీలను జత చేసి నోటిఫికేషన్ లో ఉన్న అడ్రస్ కి పంపించాలి.
ఎంపికా విధానం : అభ్యర్దులను స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 25, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 13, 2020
దరఖాస్తు పంపాల్సిన చిరునామా :
G.Suresh kumar, IIS
Dy.Director & Head of RNU
Doordarshan Kendra
Punnamathota
Vijayawada 520 010.