ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

  • Published By: veegamteam ,Published On : January 29, 2019 / 05:07 AM IST
ఓపెన్ డిగ్రీలో ప్రవేశాలకు  నోటిఫికేషన్ విడుదల

Updated On : January 29, 2019 / 5:07 AM IST

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివేందుకు అర్హత పరీక్ష-2019 నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేది మార్చి 28గా నిర్ణయించారు. ఏ స్టడీసెంటర్ నుంచైనా బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో చేరేందుకు యూనివర్సిటీ అవకాశం కల్పించింది.

ఇంటర్మీడియట్ పాసై, 2019 జూలై ఒకటి నాటికి 18 ఏళ్లు నిండినవారు 3 ఏళ్ల డిగ్రీలో ప్రవేశం పొందవచ్చు. ఇంటర్ చదవనివారు www.braouonline.inలో దరఖాస్తు చేసుకొని, పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవాలి. రూ.300 పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో లేదా ఫ్రాంచైజీ సెంటర్లలో రూ.310 చెల్లించి  రిసిప్ట్ తీసుకొవచ్చు. ఏప్రిల్ 28న ప్రవేశాలకు అర్హత పరీక్ష ఉంటుంది.