DRDO లో అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాలు

కాంబాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవాడి నుంచి అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 116 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
కార్పెంటర్ – 2
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) – 23
డ్రాఫ్ట్స్ మెన్ – 5
ఎలక్ట్రీషియన్ – 20
ఎలక్ట్రానిక్స్ – 2
మెషినిస్ట్ – 11
ఫిట్టర్ – 33
మోటార్ వెహికల్ మెకానిక్ – 5
పెయింటర్ – 2
ఫ్లంబర్ – 2
టర్నర్ – 5
వెల్డర్ – 6
విద్యార్హత : అభ్యర్దులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : అభ్యర్దుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వడ్ అభ్యర్దులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపికా విధానం : అభ్యర్దులను డాక్యూమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 29, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 21, 2020.