DRDO DIBER Apprentice : డీఆర్‌డీఓ డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఎనర్జీ రిసెర్చ్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను నియామకం ఉంటుంది.

DRDO DIBER Apprentice : డీఆర్‌డీఓ డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఎనర్జీ రిసెర్చ్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

DRDO Defense Institute of Bioenergy Research

Updated On : August 23, 2022 / 11:31 AM IST

DRDO DIBER Apprentice : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డీఆర్‌డీఓ డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోఎనర్జీ రిసెర్చ్‌ లో 22 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మెకానిక్‌, మెకానిక్‌ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానిక్‌ రిపేర్‌, మెకానిక్‌ ట్రాక్టర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, ల్యాబరేటరీ అసిస్టెంట్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌, ఫ్లోరిస్ట్‌ అండ్‌ ల్యాండ్‌స్కేప్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌ తదితర అప్రెంటిస్ ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్ధులను నియామకం ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.6000ల చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ;www.drdo.gov.in పరిశీలించగలరు.