KVS Recruitment : కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడగింపు!

పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ/బీఈడీ/పీజీ, డిప్లొమా/బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/బీఎస్సీ/ఎమ్‌సీఏ/బీసీఏ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

KVS Recruitment : కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడగింపు!

Extension of application deadline for teaching and non-teaching jobs in Central Vidyalayas!

Updated On : December 27, 2022 / 3:45 PM IST

KVS Recruitment : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తుల ప్రక్రియకు చివరిగడువు డిసెంబర్ 26గా నిర్ణయించారు. అయితే దరఖాస్తు గడువును 2023 జనవరి 2 వతేది వరకు పొడిగించారు. ఆమేరకు కేంద్రీయ విద్యాలయ సంగఠన్‌ ప్రకటనను జారీ చేసింది.

విద్యార్హతలు, వయసు, అనుభవం విషయాల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం లభించినట్లైంది. అసిస్టెంట్‌ కమిషనర్‌, ప్రిన్సిపల్‌, వైస్‌-ప్రిన్సిపల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ/బీఈడీ/పీజీ, డిప్లొమా/బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/బీఎస్సీ/ఎమ్‌సీఏ/బీసీఏ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

అసిస్టెంట్‌ కమిషనర్‌, ప్రిన్సిపల్‌, వైస్‌-ప్రిన్సిపల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.2300లు, పీఆర్టీ,టీజీటీ,పీజీటీ,ఫైనాన్స్‌ ఆఫీసర్‌,ఏఈ,లైబ్రేరియన్‌,ఏఎస్‌ఓ,హెచ్‌టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1500, ఎస్‌ఎస్ఏ/స్టెనో/జేఎస్‌ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు రూ.1200లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్ష తేదిని త్వరలో ప్రకటిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; WWW.kvsangathan.nic.in. పరిశీలించగలరు.