EMRS Recruitment 2023 : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈఎమ్ఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ విధానంలో ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ భాషలో పరీక్షను నిర్వహిస్తారు. మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్ ఉద్యోగాలకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు నెలకు రూ. 29,200 నుంచి రూ.92,300 చెల్లిస్తారు.

EMRS Recruitment 2023 : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Ekalavya Model Residential Schools

Updated On : July 19, 2023 / 1:13 PM IST

EMRS Recruitment 2023 : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6329 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి టీజీటీ 5,660 ఖాళీలు, హాస్టల్ వార్డెన్ (మేల్) 335 ఖాళీలు, హాస్టల్ వార్డెన్ (మహిళలు) 334 ఖాళీలు భర్తీ చేస్తారు. టీజీటీలో హిందీ 606, ఇంగ్లీష్ 671, మ్యాథ్స్ 686, సోషల్ స్టడీస్ 670, సైన్స్ 678 ఖాళీలను సబ్జెక్టుల వారీగా కేటాయించారు.

READ ALSO : Kakara Sagu : శాశ్వత పందిర్లపై కాకర సాగు.. ఎకరాకు రూ. 80 వేల నికర ఆదాయం

వీటితోపాటు ఇతర ఉద్యోగ ఖాళీలకు సంబంధించి మ్యూజిక్ 320, ఆర్ట్ 342, పీఈటీ(పురుషులు) 321, పీఈటీ(మహిళలు) 345, లైబ్రేరియన్ 369 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు
చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే టీజీటీ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులో బ్యాచ్ లర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. సీటెట్ లేదా స్టేట్ సెట్ అర్హత సాధించి ఉండాలి. టీజీటీ ఉద్యోగాలకు రూ. 1500 ఫీజు చెల్లించాలి. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

READ ALSO : Vegetable Farming : రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు.. ఏడాదికి రూ. 4 లక్షల నికర ఆదాయం పొందుతున్న నల్గొండ రైతు

ఇతర ఉద్యోగాలకు సంబంధించి టీజీటీ మ్యూజిక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మ్యూజిక్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టీజీటీ ఆర్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫైన్ ఆర్ట్స్ లేదా క్రాఫ్ట్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఫైన్ ఆర్ట్స్ బీఈడీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టీజీటీ పీఈటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పిజికల్ ఎడ్యూకేషన్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. టీజీటీ లైబ్రేరియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా డిగ్రీతో పాటు.. ఒక సంవత్సరం లైబ్రరీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. హాస్ట్ వార్టెన్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా ఏదైనా బ్యాచ్ లర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

READ ALSO :Kurnool District : మహిళా రైతు పంట పండింది.. పొలంలో దొరికిన వజ్రంతో లక్షాధికారి అయ్యింది

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈఎమ్ఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ విధానంలో ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ భాషలో పరీక్షను నిర్వహిస్తారు. మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్ ఉద్యోగాలకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు నెలకు రూ. 29,200 నుంచి రూ.92,300 చెల్లిస్తారు. టీజీటీ ఉద్యోగాలకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 చెల్లిస్తారు.

దరఖాస్తుల ప్రక్రియ గడువు ఆగస్టు 18, 2023న ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://emrs.tribal.gov.in/ పరిశీలించగలరు.