Jobs : ఆర్సీఎఫ్ఎల్ లో టెక్నీషియన్ ఖాళీల భర్తీ
విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే మెకానికల్ 51 ఖాళీలు, ఎలక్ట్రికల్ 32 ఖాళీలు, ఇన్ స్ట్రుమెంటేషనల్ 28 ఖాళీలు ఉన్నాయి.

Rcfl Jobs
Jobs : ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీనికి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ అనుసరించి మొత్తం 111 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే మెకానికల్ 51 ఖాళీలు, ఎలక్ట్రికల్ 32 ఖాళీలు, ఇన్ స్ట్రుమెంటేషనల్ 28 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగాల్ని అనుసరించి ఆయా సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా , బీఎస్సీ(ఫిజిక్స్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్ధుల వయస్సు 31 సంవత్సరాలకు మించకూడదు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 22,000రూ నుండి 60,000రూ వరకు వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 4, 2022 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.rcfltd.com/సంప్రదించగలరు.