BSF JOBS : బీఎస్ఎఫ్ లో ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

BSF JOBS : బీఎస్ఎఫ్ లో ఖాళీల భర్తీ

Bsf Jobs

Updated On : June 13, 2022 / 7:42 PM IST

BSF JOBS : భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం పరిధిలో గ్రూప్ బి, గ్రూప్ సీ పోస్టుల బర్తీ చేపట్టనున్నారు. అర్హులైన, ఆసక్తి కలిగిన స్త్రీ , పురుష అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 110 ఖాళీలను భర్తీ చేయించనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో సబ్ ఇన్ స్పెక్టర్ 22 ఖాళీలు, కానిస్టేబుల్ 88 ఖాళీలు ఉన్నాయి. వెహికల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, స్టోర్ కీపర్, వెల్డర్, టర్నర్, పెయింటర్ తదితరాలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https: rectt.bsf.in పరిశీలించగలరు.