NABARD Recruitment : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

National Bank for Agriculture and Rural Development
NABARD Recruitment : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 177 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల వివరాలకు సంబంధించి డెవలప్‌మెంట్ అసిస్టెంట్ 173, డెవలప్‌మెంట్ అసిస్టెంట్(హిందీ) 4 ఖాళీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న నారాబ్డ్ బ్రాంచీలలో ఈ ఖాళీలు ఉన్నాయి.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 32,000 జీతంగా అందిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రకియ 15 సెప్టెంబర్ 2022 న ప్రారంభమై 10 అక్టోబర్ 2022తో ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nabard.org/ పరిశీలించగలరు.