MECL Recruitment : మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్‌, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

MECL Recruitment : మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ

Mineral Exploration Corporation Limited

Updated On : August 28, 2023 / 3:48 PM IST

MECL Recruitment : మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఈసీఎల్)నాగ్‌పుర్‌ లోని తమ సంస్ధలో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు . ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

READ ALSO : Cobra Video: 3 గంటల పాటు కాలిని చుట్టేసిన విషపూరిత పాము.. కదలలేక, అరవలేక అమ్మాయి

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి అకౌంటెంట్‌: 06 పోస్టులు,హిందీ ట్రాన్స్‌లేటర్‌: 01 పోస్టులు, అసిస్టెంట్‌ (శాంప్లింగ్): 10 పోస్టులు, టెక్నీషియన్‌ (సర్వే & డ్రాఫ్ట్స్‌మ్యాన్): 06 పోస్టులు, ఎలక్ట్రీషియన్‌ (ల్యాబొరేటరీ): 05 పోస్టులు, ఎలక్ట్రీషియన్: 04 పోస్టులు, అసిస్టెంట్ (మెటీరియల్స్): 05 పోస్టులు, అసిస్టెంట్ (హిందీ): 01 పోస్టులు,అసిస్టెంట్ (అకౌంట్స్): 04 పోస్టులు, అసిస్టెంట్ (హెచ్‌ఆర్): 07 పోస్టులు ఉన్నాయి.

READ ALSO : PM Race: మొదటిసారి ప్రధాని రేసులో మోదీని దాటేసిన రాహుల్.. సర్వేలో చాలా చిత్రమైన అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రజలు

పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్‌, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 30 సంవత్సరాలు గా నిర్ణయించారు. కనీసం 03 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి. ఎంపిక విధానం షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20200-రూ.55900 చెల్లిస్తారు.

READ ALSO : Benefits of Makhanas : గుండె ఆరోగ్యం, మధుమేహ నియంత్రణలో మఖానాస్ తో కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు సెప్టెంబరు 13, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: రూ.100.గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.mecl.co.in/ పరిశీలించగలరు.