Cobra Video: 3 గంటల పాటు కాలిని చుట్టేసిన విషపూరిత పాము.. కదలలేక, అరవలేక అమ్మాయి

నాగుపామునే ఆభరణంగా కలిగిన పరమేశ్వరుడిని ప్రార్థించింది. చివరకు...

Cobra Video: 3 గంటల పాటు కాలిని చుట్టేసిన విషపూరిత పాము.. కదలలేక, అరవలేక అమ్మాయి

Cobra wrapped around her leg

Updated On : August 28, 2023 / 3:41 PM IST

Cobra Video – Uttar Pradesh: హిందూ పురాణాల ప్రకారం శివుడి మెడ చుట్టూ పాము ఉంటుంది. అందరికీ పామును చూస్తే భయం.. శివుడికి మాత్రం అదో అలంకారం. మనుషిని పాము చుట్టుకుని ఉంటే ఆ భయానికి గుండె ఆగిపోతుంది.

పామును చూస్తూనే మనందరం ఆందోళన చెందుతాం. అయితే, ఈ అమ్మాయి మాత్రం దైవభక్తితో ధైర్యంగా, చాలా ప్రశాంతంగా పామును మూడు గంటల పాటు ఎదుర్కొంది. ఈ అసాధారణ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని మహోబా, దహర్రా గ్రామంలో చోటుచేసుకుంది. ఓ యువతి ఇంట్లో ఉండగా ఆమె కాలిని నాగు పాము చుట్టేసింది.

Cobra

ముందుకు కదలలేక, వెనకకు వెళ్లలేక, మాట్లాడలేక, అరవలేక మూడు గంటల పాటు ఆమె అలాగే కూర్చుండి పోయింది. నాగుపాముకి మొక్కితే అది కరవకుండా వెళ్లిపోతుందని తనకు చిన్నప్పుడు ఎవరో చెప్పిన మాట ఆమెకు గుర్తుకువచ్చింది. నిజమేననుకుని ఆమె నాగుపామునే ఆభరణంగా కలిగిన పరమేశ్వరుడిని ప్రార్థించింది.

తమను నోమును పండించి, కరుణించాలని వేడుకుంది. ఆ సమయంలో దైవంపై నమ్మకంతో ఆమె చాలా ప్రశాంతంగా కనపడింది. ఇంతలో ఎవరో 112 ఎమర్జెన్సీ సర్వీస్ నంబరుకు ఫోన్ చేశారు. ఎమర్జెన్సీ సిబ్బంది దేవుడిలా వచ్చి ఆ అమ్మాయిని పాము భారి నుంచి రక్షించారు.

Kangana Ranaut : ‘చంద్రముఖి’గా కంగనా ‘నవరసాల’ ప్రదర్శన చూశారా..?