Sundar Pichai : సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ ఎలా అయ్యాడు..? సాధారణ జీవితం నుంచి ఆల్ఫాబెట్ వరకు.. ఆయన సక్సెస్ సీక్రెట్ ఇదే..!

Sundar Pichai Success Story : భారతీయ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆల్ఫాబెట్ ఇంక్ వరకు.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Sundar Pichai Success Story

Sundar Pichai Success Story : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఎందరికో ఆదర్శం. ఆయన జీవితంలో అడుగడుగునా విజయాలే. మన దేశంలో చిన్న పట్టణంలో ఒక సాధారణ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్ ఇంక్, గూగుల్ కంపెనీ సీఈఓ స్థాయికి ఎదిగారు. సుందర్ పిచాయ్ జర్నీ చాలా గొప్పది. ఆయన కృషి, దృఢ సంకల్పం అన్ని అడ్డంకులను ఎలా అధిగమించాలో నేర్పిస్తుంది.

ఒక విజయం వరించాలంటే ఎంతగా కష్టపడాలో తెలియాలంటే ఆయన స్టోరీ చదివితే చాలు.. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీనికి సీఈఓగా ఉన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి ఆదర్శనంగా నిలుస్తున్నారు. ఆయన జర్నీ ఎందరికో స్ఫూర్తిదాయకమైనది. ఆయన విద్యా అర్హతలు, వ్యక్తిగత జీవితం, విజయ రహాస్యాలను ఓసారి వివరంగా తెలుసుకుందాం.

Read Also : Amazon Sale 2025 : కొత్త ఏసీ కావాలా? అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు.. తక్కువ ధరకే 5 స్టార్ రేటింగ్ స్ప్లిట్ ఏసీలు కొనేసుకోండి!

స్టడీ కెరీర్ ఎలా సాగిందంటే? :
మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుందర్ పిచాయ్ జూన్ 10, 1972న భారత్‌లోని తమిళనాడు మధురైలో రేగుణనాథ పిచాయ్, లక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి రేగుణనాథ పిచాయ్ జీఈసీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాగా, ఆయన తల్లి లక్ష్మి స్టెనోగ్రాఫర్. పిచాయ్‌కు శ్రీనివాసన్ పిచాయ్ అనే తమ్ముడు కూడా ఉన్నారు. ఆయన స్వదేశంలోని చిన్న పట్టణంలో సాధారణ మధ్యతరగతి పెంపకంలో పెరిగారు.

చెన్నైలోని జవహర్ విద్యాలయ సీనియర్ సెకండరీ స్కూల్, ఐఐటీ మద్రాస్‌లోని వాన వాణి స్కూల్ (XII Class) నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత, పిచాయ్ ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆపై స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్‌లో ఎంఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లాడు. ఆ తరువాత, ఆయన పెన్సిల్వేనియా యూనివర్శిటీలో వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

పిచాయ్ వ్యక్తిగత జీవితం :
సుందర్ పిచాయ్ అంజలి పిచాయ్ (హర్యాణి)ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుందర్ అంజలిని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కలిసి చదివే సమయంలో పిచాయ్ కలిశారు. కొన్నాళ్ల పాటు వారి స్నేహం కొనసాగింది. ఆ తర్వాత వీరిద్దరూ ఒక్కటయ్యారు. వర్క్ విషయంలోనే కాదు.. సుందర్ పిచాయ్ క్రికెట్, ఫుట్‌బాల్ పట్ల కూడా ఎక్కువ ఇష్టం చూపించేవారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో, తన బాల్యంలో ప్రొఫెషనల్ క్రికెటర్ అనేది కలగా వెల్లడించారు. కానీ, ఆయన కెరీర్ టెక్ రంగంలో స్థిరపడింది. సుందర్ పిచాయ్ విజయం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

గూగుల్ సాధారణ ఉద్యోగిగా :
2004లో పిచాయ్ గూగుల్‌లో చేరారు. అప్పట్లో ఆయన ప్రొడక్టు మేనేజ్‌మెంట్, డెవలప్‌మెంట్ హెడ్‌గా ఉన్నారు. ప్రారంభంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి సెర్చ్ ఇంజిన్‌లను యూజర్లకు సులభంగా యాక్సెస్ అందించడంలో విజయం సాధించారు. అనంతరం గూగుల్ క్రోమ్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే క్రోమ్ బ్రౌజర్ ఎక్కువగా వినియోగిస్తున్నారు.

2008లో పిచాయ్‌ను ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించారు. కొన్ని ఏళ్ల తరువాత 2012లో ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. 2014లో ప్రొడక్ట్ చీఫ్ అయ్యారు. ఆయన కృషి, సంకల్పంతో 2015లో గూగుల్ సీఈఓ అయ్యారు. 2019లో ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓగా కూడా నియమితులయ్యారు.

ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి సుందర్ పిచాయ్ బీటెక్ పూర్తి చేశారు. అక్కడి నుంచే ఆయన కెరీర్‌ ఆరంభమైంది. మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన తరువాత అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో హైయర్ స్టడీస్ కోసం చేరారు.

Read Also : Oppo F29 Launch : అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో F29 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 20నే లాంచ్.. ధర ఎంత తెలిసిందోచ్..!

ఆయన కృషి, అంకితభావం టెక్నాలజీ రంగంలోనే కాకుండా వ్యాపారం, మేనేజ్‌మెంట్ రంగంలో కూడా రాణించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి పిచాయ్ తీసుకున్న పాత ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన తన స్నేహితులతో కలిసి సాధారణ విద్యార్థిలాగే స్నాతకోత్సవంలో పాల్గొన్నారని చెప్పవచ్చు.

వార్షిక ఆదాయం ఎంతంటే? :
జనవరి 2025 నాటికి సుందర్ పిచాయ్ వార్షిక ఆదాయం దాదాపు 280 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,436 కోట్లు) ఉంటుందని అంచనా. ఇందులో ఆయన జీతం, బోనస్‌లు, ఇతర పెట్టుబడుల రాబడి ఉంది. ఈ మొత్తాన్ని రోజువారీ ఆదాయంగా లెక్కిస్తే.. గూగుల్ సీఈఓ రోజుకు దాదాపు రూ. 6.67 కోట్లు సంపాదిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. చాలా ఎక్కువ జీతమే. ఒక గూగుల్ సీఈఓగా ఆయన ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారో చెప్పవచ్చు.