Job Vacancies : గెయిల్‌ ఇండియా లిమిటెడ్ నొయిడాలో ఉద్యోగ ఖాళీల భర్తీ !

సీనియర్‌ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్‌ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి ఆయా పోస్టును బట్టి నెలకు రూ.40,000, రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

GAIL India Limited Noida Job Vacancies!

Job Vacancies : నోయిడాలోని గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 126 సీనియర్‌ అసోసియేట్, జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో టెక్నికల్‌, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ, మార్కెటింగ్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.

READ ALSO : Watermelon : వేసవిలో మీ శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడే పుచ్చకాయ !

సీనియర్‌ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్‌ అసోసియేట్ పోస్టులకు రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి ఆయా పోస్టును బట్టి నెలకు రూ.40,000, రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.gailonline.com పరిశీలించగలరు.