జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా..20కి పైగా సంస్థలు

  • Published By: veegamteam ,Published On : February 17, 2019 / 05:18 AM IST
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా..20కి పైగా సంస్థలు

Updated On : February 17, 2019 / 5:18 AM IST

GHMC సికింద్రాబాద్‌ జోన్‌ పరిధిలో అర్బన్‌ కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌ (UCD) ఆధ్వర్యంలో ఈనెల 18న నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు GHMC ముషీరాబాద్ సర్కిల్-15 డిప్యూటీ కమిషనర్ ఉమా ప్రకాశ్ తెలిపారు. 18వ తేదీన సికింద్రాబాద్ హరిహరా కళాభవన్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్‌మేళాను నిర్వహించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టెన్త్ పాస్/ఫెయిల్, ITI, ఇంటర్మీడియెట్, BSC, MBA, B-TECH, MCA, డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ జాబ్‌మేళాకు అర్హులు. ముఖ్యంగా 18 నుంచి 35 ఏండ్లలోపు యువతీ యువకులు ఈ జాబ్‌ మేళాకు హాజరుకావాలని సూచించారు. 20కి పైగా వివిధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అసక్తి కలిగిన యువతీ, యువకులు ధ్రువీకరణ పత్రాలు వర్జినల్‌, జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలని సూచించారు.