భారీ శుభవార్త : 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేందుక కేంద్ర ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోంది. ఓసీలకు రిజర్వేషన్లు, పెన్షన్లు, రైతులకు పెట్టుబడి సాయం ఇలాంటివి అనౌన్స్ చేసింది.

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేందుక కేంద్ర ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోంది. ఓసీలకు రిజర్వేషన్లు, పెన్షన్లు, రైతులకు పెట్టుబడి సాయం ఇలాంటివి అనౌన్స్ చేసింది.
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేందుక కేంద్ర ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోంది. ఓసీలకు రిజర్వేషన్లు, పెన్షన్లు, రైతులకు పెట్టుబడి సాయం ఇలాంటివి అనౌన్స్ చేసింది. ఇప్పుడు నిరుద్యోగులపై మోడీ ప్రభుత్వం కన్ను పడింది. తీవ్ర నిరాశలో ఉన్న నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందకు కేంద్రం భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తోంది. ఏకంగా 2.5 లక్షల కేంద్ర ఉద్యోగాల భర్తీకి మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ చేయనుంది. కొత్తగా ప్రకటించే పోస్టుల్లో 40శాతం పారా మిలటరీ బలగాల్లోనే ఉండనున్నాయి. ప్రస్తుతం ఆ బలగాల్లో 10.24 లక్షల మంది ఉండగా దాన్ని 11.25 లక్షలకు పెంచబోతున్నారు.
* 40శాతం పోస్టులు పారా మిలటరీలో బలగాల్లోనే
* ఆదాయపు పన్ను శాఖలో 35వేల పోస్టులు
* కస్టమ్స్-సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో 39వేల పోస్టులు
* వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ వంటివాటిల్లో 75వేల పోస్టులు
ఈ పోస్టులన్నీ త్వరలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం. బడ్జెట్ తర్వాత ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం వచ్చాక ఈ నాలుగేళ్లలో కేంద్ర ఉద్యోగుల సంఖ్య 2.26 శాతం మేర తగ్గింది. రక్షణ బలగాలు మినహా దేశంలో కేంద్ర ఉద్యోగుల సంఖ్య 2014లో 33.3లక్షలు ఉంటే 2018 నాటికి 32.52 లక్షలకు తగ్గింది. అంటే నాలుగేళ్లలో 75వేల 231 మంది కేంద్ర ఉద్యోగులు తగ్గిపోయారు. కాంట్రాక్ట్ బేస్, ఔట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేస్తుండటమే ఇందుకు కారణం. అంతేకాదు రిటైర్ అయిన వారిని కన్సల్టెంట్లుగా మళ్లీ అపాయింట్ చేయడం మరో కారణం. రైల్వేలో 2010లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో 2018లో కూడా అంతేమంది ఉద్యోగులు ఉన్నారు. UPSC, SSC, Railway Recruitment Board ద్వారా జరిగిన మొత్తం నియామకాలు 2016-16లో లక్ష 13వేల 524.. కాగా 2017-18లో లక్ష 933 నియామకాలు మాత్రమే జరిగాయి.