Agniveer Vayu Result 2023 : అగ్నివీర్ వాయు రాతపరీక్ష ఫలితాలను డౌన్ లోడ్ చేయటం ఎలాగంటే ?

అభ్యర్థులుఫేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫేజ్-2లో భాగంగా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2 నిర్వహించనున్నారు.

Agniveer Vayu Result 2023 : భారత వాయుసేనలో అగ్నివీర్‌ వాయు (01/ 2024) నియామకాలకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్ష (ఫేజ్-1) ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్ధుల సౌకర్యార్ధం అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ యూజర్‌నేమ్‌, ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు నమోదుచేసి పరీక్షా ఫలితాలు తెలుసుకోవచ్చు.

READ ALSO : First Robot CEO Mika : ప్రపంచంలోనే ఫస్ట్ రోబోట్ సీఈఓ మికా…మస్క్ కంటే మెరుగ్గా పనిచేస్తోందట…మికాను కలుద్దాం రండి

పరీక్ష వ్రాసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం అభ్యర్ధులు ఇప్పటి వరకు ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ప్రస్తుతం ఫలితాలు విడుదల కావటంతో అభ్యర్ధుల్లో ఉత్కంఠకు తెరపడినట్లైంది. ఎయిర్‌ఫోర్స్ పరీక్ష ను మొత్తం 3500పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించారు. అక్టోబర్ 13, 2023 న ఈ పరీక్ష జరిగింది.

READ ALSO : Ayodhya Deepotsav : అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం.. సరయూ నదీ తీరంలో 51 ఘాట్ లలో 24 లక్షల దీపాలు.. ప్రపంచ గిన్నిస్ రికార్డు

అభ్యర్థులుఫేజ్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫేజ్-2లో భాగంగా ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2 నిర్వహించనున్నారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఫేజ్-3లో మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించి, చివరగా ధ్రువపత్రాలను పరిశీలన జరిపి అభ్యర్థులను ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు.

READ ALSO : New COVID Variant : దీపావళి పండుగ సీజన్‌లో జ్వరాలు వస్తే జాగ్రత్త…కొత్త కొవిడ్ జేఎన్1 వేరియంట్ వ్యాప్తి, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫలితాలు 2023 డౌన్‌లోడ్ చేయటం ఎలా ?

అగ్నివీర్ వాయుసేన వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరి మెరిట్ జాబితా. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫలితాలు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే తెలుసుకోనేందుకు అవకాశం కల్పించారు. అదేలాగో పరిశీలిద్దాం.

స్టేజ్ 1: ఫలితాలు తెలుసుకునేందుకు IAF అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాల్లి. అనగా https://agnipathvayu.cdac.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

స్టేజ్ 2: “అగ్నివీర్ 01/2024” యొక్క డ్రాప్-డౌన్ మెనుపై క్లిక్ చేయాలి.

స్టేజ్ 3: వెంటనే ఒక కొత్త పేజీ స్క్రీన్ పై కనిపిస్తుంది.

స్టేజ్4: క్యాప్చా కోడ్‌తో మీ రోల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ని టైప్ చేయాలి.

స్టేజ్ 5: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫలితం 2023 స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టేజ్ 6: అభ్యర్థులు తమ భవిష్యత్ అవసరాలకోసంఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫలితాన్ని 2023ని సేవ్ చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు