New COVID Variant : దీపావళి పండుగ సీజన్‌లో జ్వరాలు వస్తే జాగ్రత్త…కొత్త కొవిడ్ జేఎన్1 వేరియంట్ వ్యాప్తి, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

దీపావళి పండుగ సీజనులో దేశంలో వైరల్ జ్వరాలు ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ బీఏ 2.86 సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల బారిన పడిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది....

New COVID Variant : దీపావళి పండుగ సీజన్‌లో జ్వరాలు వస్తే జాగ్రత్త…కొత్త కొవిడ్ జేఎన్1 వేరియంట్ వ్యాప్తి, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

New COVID Variant

New COVID Variant : దీపావళి పండుగ సీజనులో దేశంలో వైరల్ జ్వరాలు ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ బీఏ 2.86 సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల బారిన పడిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పండుగ సీజన్‌లో వైరల్ ఫీవర్‌ల పెరుగుదల కొత్త కొవిడ్ వేరియంట్ గురించి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ALSO READ : Karnataka BJP chief : యెడియూరప్ప తనయుడికి కర్ణాటక బీజేపీ పగ్గాలు

దీపావళి సీజన్ ముగుస్తున్నందున జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. మొదట ఐరోపా వాయువ్య దేశమైన లక్సెంబర్గ్ లో గుర్తించిన జేఎన్1 కొవిడ్ కేసులు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఐస్ లాండ్, అమెరికా దేశాల్లోనూ విస్తరించాయి. ఈ కొవిడ్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు సూచించారు.

ALSO READ : Deepavali : దీపావళి సందర్భంగా క్రాకర్‌ టైమ్‌ ఇదే…బాంబే హైకోర్టు సంచలన ఆదేశం

భారతదేశంలో జేఎన్ 1 కొవిడ్ మహమ్మారి కేసులు నమోదు కాకున్నా, డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వివిధ వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. దేశంలో జ్వరాల కేసులు పెరుగుతున్న దృష్ట్యా తాము జేఎన్ 1 కొవిడ్ వైరస్ ను గుర్తించడంలో సవాళ్లు ఎదురవుతున్నాయని నోయిడాలోని ఫెలిక్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ జెబా ఖాన్ చెప్పారు.

ALSO READ : Tula Uma : తుల ఉమ.. కారు ఎక్కుతారా? హస్తం గూటికి చేరతారా? ఆసక్తికరంగా వేములవాడ రాజకీయం

శీతాకాలంలో ప్రజలు వైరల్ జ్వరాల నుంచి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జేఎన్ 1 కరోనా వైరస్ లక్షణాలు జలుబు, ఛాతీనొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం ఉంటుందని వైద్యులు చెప్పారు.