Tula Uma : తుల ఉమ.. కారు ఎక్కుతారా? హస్తం గూటికి చేరతారా? ఆసక్తికరంగా వేములవాడ రాజకీయం

Tula Uma Joins Which Party : బీజేపీలో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యత లేదు. దొరలు, పెద్దోళ్లు, డబ్బు సంచులు పట్టుకొచ్చిన వాళ్లకు మాత్రమే విలువ ఉంది. సామాన్యులకు ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదు.

Tula Uma : తుల ఉమ.. కారు ఎక్కుతారా? హస్తం గూటికి చేరతారా? ఆసక్తికరంగా వేములవాడ రాజకీయం

Tula Uma Joins Which Party (Photo : Google)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు దాదాపు అన్ని పార్టీల్లోనూ ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రాత్రికి రాత్రి కండువా మార్చేస్తున్నారు. టికెట్ దక్కలేదని తెలిసింది ఆలస్యం మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలు అటు కాంగ్రెస్ లో, ఇటు బీజేపీలో చిచ్చు రాజేశాయి. ఈ రెండు పార్టీల్లోనూ అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి.

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తుల ఉమకు బీజేపీ పార్టీ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న తుల ఉమ ఇంటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ వెళ్లారు. కాంగ్రెస్ లోకి రావాలని ఆమెను ఆహ్వానించారు. అటు బీఆర్ఎస్ నేతలు కూడా తగ్గేదేలే అంటున్నారు. తుల ఉమను బీఆర్ఎలోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు. తుల ఉమతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మంతనాలు జరిపారు. తుల ఉమను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారాయన. రెండు పార్టీల నుంచి ఆహ్వానాలు అయితే అందాయి. మరి తుల ఉమ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కాంగ్రెస్ లో చేరతారా? గులాబీ గూటికి చేరతారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

కాగా, తుల ఉమకు బీజేపీ టికెట్ ఖరారైంది. అయితే ఆఖరి నిమిషంలో ఆమె స్థానంలో చెన్నమనేని వికాస్ కి టికెట్ ఇచ్చారు. దాంతో తుల ఉమ షాక్ కి గురయ్యారు. తనను మోసం చేశారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

వేములవాడ అభ్యర్థిగా తుల ఉమ పేరు ప్రకటించిన బీజేపీ.. బీఫామ్ మాత్రం ఇవ్వలేదు. చివరి నిమిషం వరకు పెండింగ్ లో ఉంచింది. అనూహ్యంగా తుల ఉమ స్థానంలో చెన్నమనేని వికాస్ రావుకు బీఫామ్ ఇచ్చింది బీజేపీ. తనను అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ మరొకరికి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి చెందిన తుల ఉమ.. బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. నమ్మించి మోసం చేశారని కన్నీటి పర్యంతం అయ్యారు. బీసీ, మహిళా వ్యతిరేక పార్టీ బీజేపీ అంటూ ఆమె ధ్వజమెత్తారు. దీనికి వేములవాడ బీజేపీ అభ్యర్థి వికాస్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ దేశంలో అన్ని వర్గాలను సమానంగా చూసేది బీజేపీ మాత్రమే అన్నారు.

”బీజేపీలో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యత లేదు. దొరలు, పెద్దోళ్లు, డబ్బు సంచులు పట్టుకొచ్చిన వాళ్లకు మాత్రమే బీజేపీలో విలువ ఉంది. సామాన్యులకు ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది. బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ. బహుజనులకు ఇక్కడ స్థానం లేదు. బీజేపీలోకి ఎందుకు వెళ్తున్నారు అని అందరూ నన్ను అడిగారు. నరేంద్ర మోదీ బీసీ కదా. బీసీ నినాదంతో ముందుకు వచ్చారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు. మహిళలకు చేయూత ఇస్తున్నారు. కచ్చితంగా మహిళలకు, బీసీలకు పెద్ద పీట వేస్తారని నమ్మి బీజేపీలోకి వచ్చా. కానీ అదంతా అబద్దం అని ఇప్పుడు తేలిపోయింది. దొరల పాలనకు వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను. బానిసత్వం నుంచి విముక్తి కోసం పోరాటం చేశాను. అప్పుడు కొట్లాడినా, ఇప్పుడు కొట్లాడినా, భవిష్యత్తులో కూడా నా పోరాటం ఆపను” అని తుల ఉమ తేల్చి చెప్పారు.